Begin typing your search above and press return to search.

ఒక్క రోజులో 30 చిన్నారి గుండెలను బతికించిన సూపర్ స్టార్ మహేష్‌

By:  Tupaki Desk   |   8 April 2022 6:14 AM GMT
ఒక్క రోజులో 30 చిన్నారి గుండెలను బతికించిన సూపర్ స్టార్ మహేష్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు చిన్నారుల హృదయాల చప్పుడుగా నిలుస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిన్నారి గుండెలకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయించారు. గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఎక్కడ ఉన్నా కూడా మహేష్ బాబు టీమ్‌ వారిని సంప్రదించి వారికి కావాల్సిన చికిత్స ను చేయిస్తున్నారు. ఆంధ్రా ఆసుపత్రి తో కలిసి మహేష్ బాబు ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

వెయ్యి ఆపరేషన్‌ లు చేయించినా కూడా మహేష్ బాబు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఇటీవలే ఏకంగా తన పేరుతో పౌండేషన్ ను ఏర్పాటు చేసి మరిన్ని గుండెలను కాపాడేందుకు ముందుకు వచ్చాడు. మహేష్ బాబు ఫౌండేషన్ తో చిన్నారుల గుండె ఆపరేషన్ లు చేయించేందుకు ముందుకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంను మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్ చూసుకుంటూ ఉంటారు.

తాజాగా ఆమె ఈ ఫోటో ను షేర్‌ చేశారు. ఒకే రోజు 30 మంది చిన్నారుల గుండె ఆపరేషన్‌ చేయించినట్లుగా తెలియజేశారు. ప్రపంచ హెల్త్‌ డే సందర్బంగా ఒకే సారి ముప్పై మంది చిన్నారుల గుండె ఆపరేషన్‌ చేయించినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ను ఆంద్ర ప్రదేశ్ గౌరవ గవర్నర్ బిశ్వ భూషన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసినట్లుగా నమ్రత తెలియజేశారు.

ఈ బృహత్‌ కార్యక్రమంలో మాతో భాగస్వామ్యం అయినందుకు గాను ఆంధ్రా ఆసుపత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ నమ్రత సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది. వందల కొద్ది చిన్నారుల గుండెలను కాపాడిన ఘనత మహేష్‌ నమ్రతలు దక్కించుకున్నారు. వారికి చిన్నారుల యొక్క ప్రాముఖ్యత.. వారి యొక్క ఆరోగ్యం గురించి తెలుసు కనుకే ఈ పని చేస్తున్నట్లుగా అభిమానులు చెబుతూ ఉంటారు.

మహేష్ బాబు మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హీరోగా సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ సాగుతోంది. అతి త్వరలోనే సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. మే నెలలో సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మోస్ట్‌ వెయిటింగ్‌ మూవీని త్రివిక్రమ్‌ తో కలిసి మహేష్‌ బాబు చేయబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది లో రాజమౌళి సినిమాను మహేష్ బాబు చేయబోతున్నాడు.