Begin typing your search above and press return to search.
మెగా పాన్ ఇండియా మూవీ `అఖండ`కు పోటీనా?
By: Tupaki Desk | 22 Nov 2021 5:14 AM GMTమాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన `మరక్కర్` డిసెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ప్రచారం పరంగా వేగం పెంచింది టీమ్. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా రోనీ రాఫెల్ ట్యూన్ చేసిన `కనులను కలిపిన..` పాటను మేకర్స్ విడుదల చేశారు.
ప్లెజెంట్ ట్యూన్ సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ఈ పాట చాలా సంప్రదాయబద్ధంగా ప్రారంభమవుతుంది. చిన్మయి ఓల్డ్ స్కూల్ టోన్ ఇవ్వడం ద్వారా దానిని మరో స్థాయికి తీసుకువెళ్లింది. సత్య ప్రకాష్ గాయకుడు కాగా.. వెన్నెలకంటి పాటను రాశారు.
ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ కీర్తి సురేష్- అర్జున్- మంజు వారియర్ మొదలైన మొత్తం ప్రధాన తారాగణం కనిపిస్తుంది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.
ఆసక్తికరంగా ఈ సినిమా బాలకృష్ణ నటించిన అఖండ రిలీజ్ రోజున వస్తోంది. అంటే ఇరువురు పెద్ద స్టార్లు నటించిన సినిమాలు థియేటర్లలో పోటీపడబోతున్నాయి. మరక్కార్ ని తెలుగుతో పాటు పలు భాషల్లో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతుండగా `అఖండ` భారీ మాస్ ఫాలోయింగ్ తో విడుదలకు సిద్ధమవుతోంది.
బోయపాటితో కలిసి ఎన్.బి.కే హ్యాట్రిక్ ఎటెంప్ట్ ఘనవిజయం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. అఖండలో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయికా నటించగా.. జగపతిబాబు- శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు.