Begin typing your search above and press return to search.

రహస్య ప్రియురాలిపై సూపర్‌ స్టార్‌ ప్రశంసలు

By:  Tupaki Desk   |   24 April 2022 3:30 AM GMT
రహస్య ప్రియురాలిపై సూపర్‌ స్టార్‌ ప్రశంసలు
X
బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హృతిక్ రోషన్ తన సుదీర్ఘ వివాహ జీవితానికి కొన్నాళ్ల క్రితం ఫుల్ స్టాప్ పెట్టాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ గానే జీవితాన్ని గడుపుతున్నాడు. అధికారికంగా సింగిల్ లైఫ్ అయినా కూడా బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు మరియు మరి కొందరు మాత్రం హృతిక్ రోషన్ సింగిల్ గా కాకుండా ఒక అమ్మాయితో మింగిల్ అయ్యి లైఫ్ ను లీడ్‌ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అంటున్నారు.

హృతిక్‌ రోషన్ గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌ నటి సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఇప్పటి వరకు హృతిక్ రోషన్ కాని నటి సబా ఆజాద్‌ కాని ఖండిస్తూ పోస్ట్‌ లు చేయలేదు.. కనీసం కామెంట్‌ కూడా చేయలేదు. పై పెచ్చు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ హింట్‌ ఇచ్చేలా వారిద్దరి సోషల్‌ మీడియా పోస్ట్‌ లు ఉంటున్నాయి.. అలాగే వారిద్దరి కలయిక ఫోటోలు ఉంటున్నాయి.

సహజంగా ఇతర సినిమాల గురించి వెబ్‌ సిరీస్ ల గురించి చాలా తక్కువ స్పందించే హృతిక్‌ రోషన్ ఈసారి రాకెట్‌ బాయ్స్ అనే వెబ్‌ సిరీస్ గురించి స్పందించాడు. సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న వెబ్‌ సిరీస్ పై తన అభిప్రాయంను తెలియజేశాడు. ఆ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ అవ్వబట్టి రెండు నెలలు అవుతుంది. ఇప్పుడు హృతిక్‌ రోషన్ కు సమయం దొరికి చూశాడట.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందిన ఒక అద్బుతమైన బయోపిక్ రాకెట్‌ బాయ్స్. ఈ వెబ్‌ సిరీస్ ను హోమీ జె బాబా మరియు విక్రమ్‌ సారా బాయ్ జీవితాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ వెబ్‌ సిరీస్ పై సోషల్‌ మీడియా ద్వారా హృతిక్ రోషన్ స్పందించిన తీరు అందరికి ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్ కు ఇచ్చిన రివ్యూ వైరల్‌ అవుతుంది.

ఇలాంటి ఒక వెబ్‌ సిరీస్‌ ను ఇండియన్ ఫిల్మ్‌ మేకర్స్ తీశారు.. ఇండియన్స్ నటించారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నాడు. వెబ్‌ సిరీస్ లో నటించిన ప్రతి ఒక్కరి నటన కూడా అద్బుతం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. తన రహస్య ప్రియురాలు సబా ఆజాద్‌ ను ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ నీవు అద్బుతంగా నటించావు. నీ నటన నాకు ఆదర్శం అన్నట్లుగా పోస్ట్‌ పెట్టాడు.

ఇదే వెబ్‌ సిరీస్ లో నటించిన రెజీనా పట్ల కూడా తన అభిమానంను హృతిక్ చాటుకున్నాడు. మొత్తానికి సబా ఆజాద్‌ గురించి హృతిక్‌ పోస్ట్‌ పెట్టడంతో ఇద్దరి మద్య వ్యవహారం చాలా దూరం వరకు వెళ్తుందని.. ఇద్దరు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో కూడా ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.