Begin typing your search above and press return to search.
సూర్యకు రజనీ ఆశీస్సులు ఫలిస్తాయా?
By: Tupaki Desk | 22 July 2019 2:07 PM GMTసూర్య కథానాయకుడిగా కెవి ఆనంద్ తెరకెక్కించిన బందోబస్త్ (కప్పాన్) త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సాయంత్రం చెన్నయ్ లో కప్పాన్ ఆడియో వేడుక జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పాతిక మంది జర్నలిస్టుల్ని లైకా సంస్థ ఆహ్వానించింది. ఇక ఈ వేడుకలో ప్రత్యేక అతిధి రజనీకాంత్ సూర్య - కేవి ఆనంద్ బృందంపై ప్రశంసలు కురిపించారు. లైకా సంస్థ సుభాస్కరన్ ని దేవుడితో పోల్చారు. అంతేకాదు సూర్య సోదరుడు కార్తీని ఆకాశానికెత్తేస్తూ రజనీ ఇచ్చిన స్పీచ్ మైమరిపించింది.
కప్పాన్ ఆడియో వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ - ``శివాజీ సినిమాలో నాతో కె.వి.ఆనంద్ పనిచేశారు. ఆ సినిమా నేను శంకర్‌తో చేయడానికి కారణమైన వ్యక్తుల్లో కె.వి.ఆనంద్ ఒకరు. ఆయనకు కథపై మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది. తనతో నేను ఒక సినిమా చేయాల్సింది. కానీ.. కొన్ని పరిస్థితుల్లో అది కుదరలేదు. ఇక మోహన్‌లాల్ ఈ సినిమాలో మంచి పాత్రలో నటించారు. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సూర్య.. నటనను `నేను దేవుణ్ణి` సినిమాలో చూసి ఆశ్చర్యపోయాను. అంత గొప్పగా నటించారు. ఇక హ్యారిశ్ జైరాజ్‌మ్యూజిక్ చాలా బావుంది. ఆయన సంగీతం అందించిన సినిమాల్లో `చెలి`లోని మనోహరా... సాంగ్ నాకు బాగా ఇష్టమైన సాంగ్. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే సుభాస్కరన్ గురించి చెప్పాలంటే... ఆయన మనకు దేవుడిచ్చిన వరం. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సగం మంది ఆయన సినిమాల్లోనే పనిచేస్తున్నారు. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో `ఇండియన్ 2` సినిమాను చేస్తున్నారు. అది తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. అలాగే 60 ఏళ్లుగా ఎంజిఆర్ నుండి ఇప్పటి వరకు ఎందరో చేయాలనుకుంటున్న `పొన్నియన్ సెల్వన్` సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నేను- మురుగదాస్ కలిసి చేస్తోన్న`దర్బార్` సినిమాను నిర్మిస్తున్నారు`` అని తెలిపారు.
బ్రదర్స్ సూర్య- కార్తీ లపైనా రజనీ ప్రశంసలు కురిపించారు. సూర్య గురించి చెప్పాలంటే ఆయన తండ్రి శివకుమార్ గురించి చెప్పాలి. తన సహనటులు ఎవరికీ చెడ్డ పేరు రాకూడదనుకునే వ్యక్తి ఆయన. ఆయన సూర్య- కార్తిని చక్కగా పెంచి పెద్ద చేశారని రజనీ తెలిపారు. కార్తి తొలి సినిమా `పరుత్తి వీరన్` (మల్లిగాడు)లో అద్భుతంగా నటించాడు. కానీ సూర్య నటించిన తొలి సినిమా చూసి ఇతనికి నటించడం రావడం లేదే అనుకున్నాను. కానీ ఆయన తనను తాను మలుచుకుని ఈ స్థాయికి వచ్చి నిలబడ్డారు. శివపుత్రుడు- సింగం-సింగం2- వీడొక్కడే-గజిని వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన తప్ప మరెవరూ చేయలేరనేంత గొప్పగా నటించారు. సూర్య ఇంకా `బందోబస్త్ వంటి సినిమాలే కాదు. ఎన్నో గొప్ప సినిమాలు చేసి ఇంకా ప్రజాభిమానం పొందాలి. తర్వాత ఆయన అవసరం తప్పకుండా ప్రజలకు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి అని ఆశీస్సులు అందించారు రజనీ.