Begin typing your search above and press return to search.
స్టార్ హీరో కాలివేళ్లు తొలగింపు.. రజినీకాంత్ ట్వీట్ వైరల్
By: Tupaki Desk | 22 Jun 2022 1:48 PM GMTతమిళ సీనియర్ హీరో.. ఒకప్పుడు తన సినిమాలతో తెలుగు వారికి కూడా చిరపరిచితుడైన విజయకాంత్ ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. తమిళనాట డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోనూ మెరిసిన విజయ్ కాంత్ కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
ఆయనకు మధుమేహం, ఇతర సమస్యలున్నాయి. కరోనా సమయంలో చావు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డారు. ఇక తాజాగా ఆయన ఆరోగ్య సమస్యలు విషమించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే డీఎండీకే పార్టీ కార్యాలయం నుంచి ఆయన హెల్గ్ అప్డేట్ విడుదలైంది.
కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న విజయ్ కాంత్ కుడికాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదు. సోమవారం వైద్యులు వాటిని అత్యవసరంగా తొలగించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో విజయకాంత్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మరో మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారు. అభిమానులు ఆందోళన పడాల్సిన పనిలేదని వెల్లడించారు.
తన తోటి హీరో విజయ్ కాంత్ ఆరోగ్యంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం స్పందించారు.'నా ప్రియమిత్రుడు విజయ్ కాంత్ త్వరగా కోలుకొని మునుపటిలా కెప్టెన్ గా గర్జించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు.
విజయ్ కాంత్ ఇనిక్కుం ఇలమై సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎక్కువగా పోలీస్ కథల్లో నటించి మెప్పించారు. దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు విజయ్ కాంత్. ఆయన నటించిన సినిమాలు తెలుగు, హిందీ భాషలలో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి.
సిటీ పోలీస్, కెప్టెన్ ప్రభాకర్, సింధూర పువ్వు, పోలీస్ అధికారి, కమిషనర్ నరసింహనాయుడు వంటి చిత్రాలు తెలుగులో హిట్ కావడమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువయ్యాడు. విజయ్ కాంత్ కు ఇద్దరు కుమారులున్నారు.