Begin typing your search above and press return to search.
టాలీవుడ్ బంద్ అయినా `జైలర్` ఆగేదేలే!
By: Tupaki Desk | 10 Aug 2022 11:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ సినిమా నిర్మాణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి నిర్మాతలంతా షూటింగ్ లు బంద్ పెట్టారు. దాదాపు స్టార్ హీరోల చిత్రాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కొత్త సినిమాల నిర్మాణం చేపట్టలేదు. సమస్యలన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరించి మళ్లీ షూటింగ్ లు యధావిధిగా జరిగేలా పరిశ్రమ చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం హీరోలతో సహా అన్ని శాఖలతో పరిశ్రమ పెద్దలు సంప్రదింపులు చేస్తున్నారు. మరోవైపు పాక్షికంగా కొన్ని చిన్న సినిమాల నిర్మాణం జరుగుతోంది. అలాగే పరభాష సినిమాలు యథావిధిగా హైదరాబాద్ స్టూడియోలు సహా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ లు జరుగుతున్నాయి. వాటికి ఎలాంటి ఆటంకం లేదు. వాటి కారణంగా స్థానిక సినీ కార్మికులకు తాత్కాలికంగా పని దొరుకుతుంది.
ఇక రామోజీ ఫిలిం సిటీలో మాత్రం షూటింగ్ హడావుడి అంతా మామూలుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర భాషల సినిమాలు తరుచూ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించనున్న `జైలర్` కూడప రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఈనెల 15 లేదా 22వ తేదీల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి టీమ్ రెడీ అవుతోంది.
ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా వెల్లడించారు. తొలి షెడ్యూల్ కోసం భాగ్యనగరంలో ఓ స్టూడియోలో భారీ సెట్ నిర్మించారు. అందులో రజనీకాంత్ సహా కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అటుపై మరికొన్ని సన్నివేశాలు హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇది పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్.
రజనీ మార్క్ ఎంటర్ టైనర్. ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్కాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఇదే దర్శకుడు తెరకెక్కించిన `బీస్ట్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ - దిలీప్ తో ముందుకు వెళ్తారా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. ఒకానొక దశలో ప్రాజెక్ట్ ఆగిపోయిందని కోలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ ఆ సందేహాలకి..ప్రచారానికి రజనీకాంత్ పుల్ స్టాప్ పెడుతూ దిలీప్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇక రజనీకాంత్ గత చిత్రం `అన్నాథై`తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అన్నా-చెల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అంతకు ముందు `దర్బార్` తో నిరాశ పరిచినా అన్నాథై తో బ్యాలెన్స్ చేసారు. మరి `జైలర్` సంగతేంటో చూడాలి.