Begin typing your search above and press return to search.
ఖలేజా కు ముందు ఆ మూడేళ్ల వల్లే సూపర్ స్టార్ హోదా!
By: Tupaki Desk | 4 Feb 2022 2:30 PM GMTఎప్పుడెప్పుడా అంటూ ఎందురు చూస్తున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ మహేష్ బాబు స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు సమయం అయ్యింది. రెండు వారాల క్రితమే ఈ ఎపిసోడ్ ప్రోమో ను వదిలి అంచనాలు పెంచారు. ఇప్పడు మరో ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేసింది. ఈసారి ప్రోమోతో మరింతగా ఎపిసోడ్ పై ఆసక్తి పెంచారు అనడంలో సందేహం లేదు. మహేష్ బాబు ప్రేమ వ్యవహారం మరియు ఖలేజా కు ముందు మూడు సంవత్సరాల గ్యాప్ చాలా కాలంగా సస్పెన్స్ విషయాలుగా ఉన్నాయి. ఆ రెండు విషయాల గురించి బాలకృష్ణ ఈ షో లో మహేష్ బాబు నుండి స్పష్టత తీసుకున్నాడు అని ప్రోమో తో క్లారిటీ వచ్చింది. ఆ రెండు విషయాల గురించి మహేష్ బాబు గతంలో ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడింది లేదు. దాంతో అనేక ప్రశ్నలు ఆ రెండు సంఘటనల గురించి ఉన్నాయి. ఆ ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు రాబట్టినట్లుగానే అనిపిస్తుంది.
ఖలేజా సినిమా 2010 సంవత్సరంలో వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా కోసం అభిమానులు దాదాపుగా మూడున్నర ఏళ్లు వెయిట్ చేశారు. 2007 సంవత్సరంలో అతిధి రావడం.. ఆ తర్వాత మూడు ఏళ్లు గ్యాప్ రావడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. అసలు ఏం జరుగుతుంది.. మహేష్ బాబు ఎందుకు తన కెరీర్ ను తానే పాడు చేసుకుంటున్నాడు అంటూ అభిమానులు జుట్టు పీక్కున్నారు. ఖలేజా విడుదల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు ఇలాంటి సినిమా తో వచ్చాడేంటి.. అసలు ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు సినీ ఆఫర్లు వస్తాయా అంటూ ఏవో ఏవేవో చర్చలు అభిమానుల్లో జరగాయి. కాని ఖలేజాకు ముందు మూడు సంవత్సరాల గ్యాప్ లో తనను తాను తెలుసుకున్నాను అంటూ మహేష్ బాబు ఈ టాక్ షో లో అన్నాడు. ఆ మూడు సంవత్సరాల గ్యాప్ మహేష్ బాబు లో చాలా మార్పును తీసుకు వచ్చింది. అప్పటి నుండి అంటే గత పదేళ్లుగా మహేష్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు.
ఈ సమయంలో ఆయనకు బ్రహ్మోత్సవం వంటి ప్లాప్ పడ్డా కూడా వెను దిరిగి చూసుకోలేదు. ఆ గ్యాప్ వల్లే మహేష్ బాబు మరింత రాటు తేలాడు అనిపించింది. ఆయనకు దూకుడు సినిమా తో సూపర్ స్టార్ స్టార్ డమ్ దక్కింది. సూపర్ స్టార్ ఇమేజ్ కు మహేష్ బాబు ఖచ్చితంగా అర్హుడే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అంతా కూడా ఒప్పుకునేందుకు చాలానే కష్టపడ్డాడు. మహేష్ బాబు సూపర్ స్టార్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు సినిమా సినిమాకు తనను తాను మల్చుకుంటూ వెళ్తున్న తీరు అభినందనీయం అనడంలో సందేహం లేదు. మహేష్ బాబు ప్రేమ వ్యవహారం గురించి టాక్ షో లో ఏం చెప్పబోతున్నాడు.. ఇంకా ఖలేజా సినిమా గురించి ఎలాంటి విషయాలను చెప్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. సమ్మర్ లో సర్కారు వారి పాట సినిమా విడుదల కాబోతుంది. మరో వైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ను కూడా లాంచనంగా ప్రారంభించారు. షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.