Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ సూపర్‌ నిర్ణయం.. ఫ్యాన్స్ కు స్వీట్‌ వార్నింగ్‌

By:  Tupaki Desk   |   8 April 2022 4:30 PM GMT
సూపర్ స్టార్‌ సూపర్‌ నిర్ణయం.. ఫ్యాన్స్ కు స్వీట్‌ వార్నింగ్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ అభిమానుల రచ్చ గురించి గతంలో పలు సార్లు మీడియాలో చూడటం జరిగింది. వారు సోషల్‌ మీడియా ద్వారా అవతలి హీరోను లేదా మరెవ్వరినైనా టార్గెట్‌ చేస్తే వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు కూడా తీసుకు వచ్చి విమర్శలు చేయడం మనం చూశాం. ఇక రాజకీయాలతో కూడా విజయ్ అభిమానులకు టచ్‌ ఉంటుంది. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను విజయ్‌ ఫ్యాన్స్ గతంలో విమర్శించిన దాఖలాలు చాలా ఉన్నాయి.

విజయ్ అభిమానులు గా చెప్పుకుంటూ కొందరు చేస్తున్న ఈ రాక్షస కామెంట్స్ పర్వంకు బ్రేక్‌ వేసేందుకు సిద్దం అయ్యారు. విజయ్‌ స్వయంగా ఈ విషయం లో రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. విజయ్‌ అభిమాన సంఘం విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం జాతీయ అధ్యక్షుడి పేరున ఒక లేఖ అభిమానులకు అందింది. ఆ లేఖ లో విజయ్‌ పేరు తో... విజయ్ అభిమానులం అంటూ చెప్పుకుని ఇతరులను విమర్శించవద్దని వార్నింగ్‌ ఇచ్చారు.

తమ అభిమాన సంఘం పేరుతో ఇతరులను విమర్శిస్తూ లేదా పార్టీలను విమర్శిస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం లేదంటే సోషల్‌ మీడియాలో విమర్శలు చేయడం వంటివి మానుకోవాలి. ఇకపై అలాంటివి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ చర్యలు చట్టపరంగా కూడా ఉంటాయని విజయ్‌ తరపున అభిమాన సంఘం నాయకుడు తెలియజేశాడు.

విజయ్‌ ఇప్పటికే పార్టీల పేరు తో విమర్శించబడుతున్నాడు. ఆ విమర్శలను ఎదుర్కొనే క్రమంలో విజయ్ అభిమానులు కొన్ని పార్టీలను టార్గెట్‌ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా విజయ్‌ ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ బీజేపీ నాయకులను మరియు ఆ పార్టీని విజయ్‌ అభిమానులు ఆ మద్య తీవ్రంగా విమర్శిస్తూ మీమ్స్ చేశారు. ఆ విషయం చాలా దూరం వెళ్లింది.

ఇప్పుడు విజయ్ అభిమానులు మళ్లీ రెచ్చి పోకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున విజయ్ అభిమానుల సోషల్‌ మీడియా సందడి దీంతో తగ్గే అవకాశాలు ఉన్నాయి. స్వయంగా విజయ్ నుండి స్వీట్‌ వార్నింగ్‌ వచ్చింది కనుక ఖచ్చితంగా తూచా తప్పకుండా అభిమానులు పాటించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే వారంలో విజయ్ నటించిన బీస్ట్‌ సినిమా విడుదల కు సిద్దంగా ఉంది. ఈ సమయంలో విజయ్ నుండి ఈ ప్రకటన రావడంతో ఆయన వివాదాలకు దూరంగా ఉండి తన సినిమా పై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఆమద్య విజయ్ అభిమాన సంఘం నాయకులు స్థానిక సంస్థల్లో పోటీ చేసి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. కనుక ఆయన రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వచ్చాయి. కాని ఆయనకు ఆ ఆసక్తి లేదని తేలిపోయింది.