Begin typing your search above and press return to search.
చివరి నిమిషం క్యాన్సిల్ కు కారణాలెన్నో..!
By: Tupaki Desk | 18 Jan 2022 3:18 AM GMTఓ సూపర్ స్టార్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. వారం పది రోజులుగా అభిమానులు ఆ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. అభిమానులు కౌంట్ డౌన్ చేసుకుంటూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదుగో ఇదుగో అంటూ చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ కు సంబంధించిన పోస్టర్ ను.. ప్రీ లుక్ ను కొన్ని సెకన్ల వీడియో బిట్ ను విడుదల చేసి టీజర్ పై హైప్ పెంచుతారు. టీజర్ డే రానే వచ్చింది. అయితే అనూహ్యంగా టీజర్ విడుదల సమయంకు అవ్వదు.. కొన్ని టీజర్ లు గంటలకు గంటలు ఆలస్యం అయితే మరి కొన్ని మాత్రం రోజులకు రోజులు ఆలస్యం అవుతాయి.. మొత్తానికి టీజర్ విడుదల క్యాన్సిల్ అవుతుంది. ఇలా ఈమద్య కాలంలో చాలా చాలా సినిమాల అప్‌డేట్స్ ను చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగింది.
ఇలా చివరి నిమిషం వాయిదా వేయడం వల్ల సినిమా గురించి చర్చ జరుగుతుంది.. అయితే అది బ్యాడ్ టాక్ అయినా కూడా సినిమా పై బజ్ క్రియేట్ చేస్తుందని కొందరు మేకర్స్ భావిస్తూ ఉంటారు. ఆ టాక్ కోసం కాకున్నా ఏదో ఒక కారణం వల్ల చివరి నిమిషంలో వాయిదా వేసిన సందర్బాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక టీజర్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తీసుకుంటే దాన్ని విడుదల చేయడం కోసం చాలా మంది నుండి అప్రూవ్ రావాల్సి ఉంటుంది. దర్శకుడు.. నిర్మాత.. హీరో ఇలా ప్రతి ఒక్కరు కూడా పలువురి అభిప్రాయాలను తీసుకుంటారు. ఆ అభిప్రాయలను అనుసారంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోని ఇతర ఫిల్మ్ మేకర్స్ సలహాలు మరియు సూచనలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఏదైనా మంచి ఆలోచనతో ఎవరైనా వస్తే తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు దర్శకుడు సిద్దం అవుతారు.
చివరి నిమిషం మార్పులు చేర్పులు చిన్నవి అయితే పర్వాలేదు కాని పెద్ద మార్పులు చేయాల్సి వస్తే అప్పటికి అప్పుడు చేయడం సాధ్యం కాదు. అందుకే టెక్నికల్ ఇష్యూ అంటూ వాయిదా వేస్తూ ఉంటారు. మరో బెస్ట్ ఔట్ పుట్ ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తారు. సినిమాకు టీజర్ ట్రైలర్ పోస్టర్ లు అత్యంత కీలకం. వాటితోనే సినిమా స్థాయి పెరుగుతుంది. కనుక వాటి విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోరు.. తీసుకోకూడదు. అందుకే ఫిల్మ్ మేకర్స్ చివరి నిమిషంలో వాయిదాల పర్వం కొనసాగిస్తూ ఉన్నారు.
వాయిదా పడి వచ్చిన టీజర్ లు ట్రైలర్ లు మంచి స్పందన దక్కించుకున్నాయి.. వాటి వాటి సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. అందుకే చివరి నిమిషం క్యాన్సిల్ కు కారణాలు ఎన్ని ఉన్నా.. టెక్నికల్ సమస్య అంటూ వాయిదా వేసినా కూడా ముందు ముందు మంచి కంటెంట్ వస్తుందని అభిమానులు కూడా ఈమద్య కాస్త సర్దుకు పోతున్నారు. కొందరు మాత్రం ఫిల్మ్ మేకర్స్ ను బండ బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. వారి విమర్శలు.. బూతులు పట్టించుకోకుండా మేకర్స్ తమ పని తాము అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తారు.