Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ డబుల్ ధమాకా.. ఫ్యాన్స్ జోరు
By: Tupaki Desk | 20 May 2022 2:30 AM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ సింగిల్ గా కనిపిస్తేనే ఆయన అభిమానులు ఆగలేరు.. అలాంటిది ద్విపాత్రాభినయం చేస్తే వారికి పూనకాలే అనడంలో సందేహం లేదు. భారీ బ్లాక్ బస్టర్ లు బ్యాక్ టు బ్యాక్ దక్కించుకున్న విజయ్ ఇప్పుడు తెలుగు లో తన మొదటి సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.
ఒకే సారి తెలుగు మరియు తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ వరకు పూర్తి చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యారు.
విజయ్ మరియు వంశీ పైడిపల్లి కాంబో సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే సమయంలో కీలక పాత్రలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాలో విజయ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూస్తామని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తమిళ మీడియాలో ఈ విషయం ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.
తెలుగు మీడియా వారు కూడా వంశీ పైడిపల్లి సన్నిహితులు మరియు టీమ్ నుండి ఇదే విషయాన్ని తెలుసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్ కనుక రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తే అభిమానుల జోరు మామూలుగా ఉండదేమో అనిపిస్తుంది. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న విజయ్ కి తెలుగు లో ఈ సినిమా మంచి విజయాన్ని కట్టబెట్టడం ఖాయం అనిపిస్తుంది.
తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల వద్ద.. తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోతున్న విజయ్ అందుకే డైరెక్ట్ తెలుగు సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తెలుగు దర్శకుడు.. తెలుగు నిర్మాతతో కలిసి సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను తమిళ వర్షన్ కోసం తమిళ నటీ నటులను మరియు తెలుగు వర్షన్ కోసం వేరు వేరుగా తెలుగు నటీ నటులతో తెరకెక్కిస్తున్నారట.