Begin typing your search above and press return to search.
ఇక్క రిబ్బన్‌కు ఎందరు సూపర్ స్టార్లో...
By: Tupaki Desk | 15 April 2015 1:30 AM GMTరిబ్బను కటింగులకు హీరోయిన్లే కాదు.. హీరోలు రావడం కూడా ఓ నయా ట్రెండ్. హీరోలు, హీరోయిన్లు కలిసి వస్తే అదో ట్రెండ్! ఒకే రిబ్బను .. నలుగురు తారలు అన్న చందంగా ఉంది పరిస్థితి. షాపు ఓపెనింగులో ఎంత స్టార్ పవర్ చూపిస్తే అంతా పేరొస్తుంది. అంతా క్రేజొస్తుంది అన్న గణాంకాల వల్లే ఈ ట్రెండ్‌లో ఊపు కనిపిస్తోంది.
కాజల్‌ని పిలిచి జువెలరీ షాప్ రిబ్బన్ కటింగ్ చేయించడం, సమంతను పిలిచి బట్టల దుకాణం తెరిపించడం, నయనతారను పిలిపించి మొబైల్ స్టోర్ ఓపెన్ చేయించడం .. ఇవన్నీ రొటీన్ అనుకున్నారో ఏమో! ఏకంగా ఓ దుకాణం ఓపెనింగుకి నాలుగు సినీపరిశ్రమల నుంచి దిగ్గజాల్నే రంగంలోకి దించుతున్నారు. నాగార్జున, అమితాబ్, ఐశ్వర్యారాయ్, శివరాజ్ కుమార్.. ఇంతమంది దిగ్గజాలు ఓ రిబ్బన్ కటింగ్ కార్యక్రమానికి హాజరవుతున్నారంటే ఊహించండి. అది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌తో ప్రారంభమవుతుందో వినడానికే ఆసక్తి కలిగించడంలేదూ!
అసలింతకీ ఆ షాపు ఓపెనింగు ఎప్పుడు? ఎక్కడ?... ఏప్రిల్ 17న చెన్నయ్‌లో ఈ కొత్త షాపు ఓపెనింగ్. దేశవ్యాప్తంగా విస్తరించనున్న జువెలరీ ఔట్‌లెట్‌లకు సంబంధించిన షాపన్నమాట! ఇంతమంది స్టార్లు హాజరవుతున్నారంటే ఆ షాపు ఓనరు వీళ్లందరికీ సన్నిహితుడు, బంధువు లేదా ఆప్తబంధువు ఏదో ఒకటి అయ్యుండాలి. ప్రస్తుతానికి అతడెవరనేది సస్పెన్స్.