Begin typing your search above and press return to search.
వంద కోట్ల మార్కు ఊరిస్తోంది కానీ..
By: Tupaki Desk | 4 May 2016 3:30 PM GMTఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. ‘సరైనోడు’ సినిమా విషయంలో చాలామంది అంచనాలు ఇలాగే తయారయ్యాయి. ముందు ఈ సినిమాకు వచ్చిన టాక్ చూస్తే.. ఇది పెద్ద డిజాస్టర్ అవుతుందేమో అనుకున్నారు. కానీ టాక్ తో ఏమాత్రం సంబంధం లేకుండా అదిరిపోయే రేంజిలో కలెక్షన్లు కొల్లగొట్టిందా సినిమా. కేవలం వీకెండ్ వరకు జోరు చూపించి తర్వాత చల్లబడిపోకుండా.. వీక్ డేస్ లో సైతం మంచి వసూళ్లే రాబట్టిందీ సినిమా. కేవలం పది రోజుల్లోనే ‘సరైనోడు’ రూ.54 కోట్ల షేర్. రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. బుధవారం నాటికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రూ.90 కోట్ల మార్కును టచ్ చేస్తున్నట్లు అంచనా.
అంటే ఇంకో పది కోట్లు వస్తే బన్నీ కెరీర్లోనే ఫస్ట్ 100 క్రోర్స్ మూవీ అవుతుంది. ‘బాహుబలి’ని పక్కనబెడితే.. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ తర్వాత వంద కోట్ల మార్కును టచ్ చేసిన హీరో అవుతాడు బన్నీ. ఐతే అతడి ఆశలకు గండి కొట్టడానికే అన్నట్లు ఈ వారం రెండు క్రేజున్న సినిమాలు తయారయ్యాయి. ఇందులో ప్రధానంగా ‘24’ మూవీ నుంచి ‘సరైనోడు’కు ముప్పు పొంచి ఉంది. టీజర్.. ట్రైలర్లతో విపరీతమైన ఆసక్తి రేపిన ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. శుక్రవారం విడుదల కాబోతున్న ‘24’కు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు గురువారం విడుదలయ్యే ‘సుప్రీమ్’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. జనాల్లో దీని మీద కూడా ఆసక్తి ఉంది. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే.. ‘సరైనోడు’ పనైపోయినట్లే. అసలు ఈ సినిమా డివైడ్ టాక్ తోనూ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడానికి పోటీ లేకపోవడం కూడా ఓ కారణం. ఇప్పుడు రెండు కొత్త సినిమాలకూ నెగెటివ్ టాక్ వస్తేనే.. ‘సరైనోడు’కు కలెక్షన్లు వస్తాయి. వంద కోట్ల మార్కును టచ్ చేస్తుంది. లేదంటే.. ఆ రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయే అవకాశముంది.