Begin typing your search above and press return to search.

సల్మాన్ కేసు సుప్రీం కోర్టు టేకప్ చేసింది

By:  Tupaki Desk   |   5 July 2016 11:13 AM GMT
సల్మాన్ కేసు సుప్రీం కోర్టు టేకప్ చేసింది
X
పదేళ్లుగా హిట్ అండ్ రన్ కేసు సల్మాన్ ఖాన్ ను వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో అతను దోషిగా తేలడం.. రెండేళ్ల కిందట ముంబయి స్థానిక కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించడం.. అతణ్ని జైలుకు కూడా తరలించడం.. ఇంతలో బాంబే హైకోర్టు శిక్షపై స్టే విధించడం.. సల్మాన్ ను నిర్దోషిగా తేల్చడం తెలిసిన సంగతే. ఐతే బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.

ఐతే వెంటనే విచారణను ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరగా.. ఆరు నెలల తర్వాతే విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఐతే బాంబే హైకోర్టు తీర్పు మీద జనాల్లో అనేక సందేహాలున్నాయి. సల్మాన్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని తేల్చి.. స్థానిక కోర్టు శిక్ష కూడా విధించాక.. దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ఆశ్చర్యకరమే. సుప్రీం కోర్టులో సల్మాన్ ఖాన్ కు శిక్ష పడటం ఖాయమని బాధితుల తరఫు లాయర్లు అంటున్నారు.

2002 సెప్టెంబర్ 28 రాత్రి ఓ బార్లో మద్యం సేవించి.. అర్ధరాత్రి దాటాక మితిమీరిన కారు నడుపుతూ బాంద్రా శివార్లలో ఫుట్ పాత్ మీద పడుకున్న వారిని ఢీకొట్టాడు సల్మాన్. ఆ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐతే విచారణ సమయంలో తాను అసలు కారే నడపలేదన్నాడు సల్మాన్. కానీ అతడి బాడీ గార్డు మాత్రం సల్మానే కారు నడిపాడని వాంగ్మూలమిచ్చాడు. ఆ గార్డు ఆ తర్వాత చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. చివరికి వీధుల్లో బిచ్చగాడిగా మారిపోయాడు. అయినప్పటికీ సల్మాన్ మీద అభియోగాలు బలంగానే ఉన్నాయి. చివరికి ఈ కేసు ఏమవుతుందో చూడాలి.