Begin typing your search above and press return to search.

సీబీఐకి సుశాంత్‌ కేసు

By:  Tupaki Desk   |   19 Aug 2020 8:10 AM GMT
సీబీఐకి సుశాంత్‌ కేసు
X
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పూత్‌ మృతి కేసు విషయంలో బీహార్‌ మరియు మహారాష్ట్ర పోలీసుల మద్య నెలకొన్న వివాదంకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వంను సుప్రీం కోర్టు ఆదేశించింది. పాట్నా పోలీసుల నుండి ముంబయి పోలీసులకు ఈ కేసును బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఆ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బీహార్‌ ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి ఈ కేసు అప్పగించాలంటూ సిఫార్సు చేసిన విషయం తెల్సిందే.

మహారాష్ట్ర పోలీసులు మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదు అంటూ వాదిస్తూ వచ్చారు. రెండు రాష్ట్రాల మద్య రాజకీయ వ్యవహారంగా ఇది మారుతున్న సమయంలో అనూహ్యంగా సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సుశాంత్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసుకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా ముంబయి పోలీసులు సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీం ఆదేశించింది. దాంతో సుశాంత్‌ కేసు అధికారికంగా సీబీఐ చేతికి వెళ్లింది.

ఈ కేసులో ఇప్పటికే ఈడీ రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు సీబీఐ కూడా మొదట రియా చక్రవర్తినే ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా బాలీవుడ్‌ లోని ప్రముఖులను కూడా సీబీఐ విచారించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా సుశాంత్‌ సోదరి మరియు ఆయన ఫ్యాన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా కేసును సీబీఐకి అప్పగించాలంటూ సోషల్‌ మీడియాలో ఒక ఉద్యమమే చేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో ఫ్యాన్స్‌ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.