Begin typing your search above and press return to search.

పీఎం నరేంద్రమోడీ సినిమా ఏప్రిల్‌ 5నే విడుదల

By:  Tupaki Desk   |   3 April 2019 5:24 AM GMT
పీఎం నరేంద్రమోడీ సినిమా ఏప్రిల్‌ 5నే విడుదల
X
ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు అధికార పార్టీకి కొమ్ముకాయడం అందరూ చేసేదే. అందులో భాగంగా కొంతమంది ప్రచారం చేస్తే.. ఇంకొంతమంది ఆటలు, పాటలతో అలరిస్తుంటారు. వైసీపీకి క్యూ కడుతున్న సినిమా తారలంతా ఇదే బాపతు. ఆల్‌రెడీ కొంతమంది సినీ తారలు వైసీపీకి ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే.. ఇంకొంతమంది మరో ముందడుగు వేసి సినిమాలు తీస్తుంటారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై పీఎం నరేంద్రమోదీ అనే సినిమా తీశారు. వివేక్‌ ఓబరాయ్‌ మోదీ పాత్రలో నటించిన ఈ సినిమా లెక్కప్రకారం ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే.. ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమాలు రిలీజ్‌ అయితే.. అవి ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావించిన కాంగ్రెస్‌ పార్టీ.. సినిమా రిరీజ్‌ ను ఆపాలని సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఎన్నికలు తుది దశ పూర్తయ్యే వరకు సినిమాను నిలుపుదల చేయాలని కోరింది.

కేసుని విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం.. పీఎం నరేంద్రమోదీ సినిమా విడుదలపై జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పింది. కోర్టే తమకు అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత సినిమా నిర్మాతలు ఆగుతారా పీఎం నరేంద్రమోదీ సినిమాను అనుకున్న సమయానికే అంటే ఏప్రిల్‌ 5నే రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ఏపీ హైకోర్టు రిలీజ్‌ చెయ్యొద్దని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం పీఎం నరేంద్రమోదీని మాత్రం రిలీజ్ చేసుకోవచ్చని చెప్పింది. మరోవైపు.. ఈ తీర్పు నేపథ్యంలో లక్ష్మీఎస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై మరోసారి కోర్టుని ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.