Begin typing your search above and press return to search.
అబార్షన్ పై సుప్రీంకోర్టు తీర్పు.. పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 30 Sep 2022 4:09 AM GMTతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూనమ్.. తన దృష్టికి వచ్చిన విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. కొన్ని సామాజిక సమస్యలపైనా గొంతు విప్పుతుంది. ఈ క్రమంలో వివాదాలు కొని తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అబార్షన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతునిచ్చి వార్తల్లో నిలిచింది పూనమ్.
అబార్షన్ పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమమేమీ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వివాహితులు అవివాహితులు అనే తేడా లేకుండా సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్ కు మహిళలు ఎవరైనా అర్హులేనని పేర్కొంది.
మెడికల్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. ఒంటరి మహిళలు మరియు అవివాహిత మహిళలకు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది. అయితే నిబంధనల ప్రకారం 24 వారాల గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు అర్హులని సుప్రీంకోర్లు వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై పూనమ్ కౌర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుకు పూనమ్ మద్దతిస్తూ.. గర్భం దాల్చిన తర్వాత పురుషులు తమ రిలేషన్ షిప్ కు కట్టుబడి ఉండమని బలవంతం చేయడం తాను చూశానని చెప్పింది. స్త్రీలు వివాహాన్ని ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు గర్భం దాల్చడం చూశానని పేర్కొంది.
"నేను సుప్రీం కోర్ట్ తీర్పుకు మద్దతుగా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే, పెళ్లిని ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి స్త్రీలు గర్భం దాల్చడం చూశాను. కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుంది. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదు" అని పూనమ్ అన్నారు.
అయితే అబార్షన్ పై పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్స్ ఎవరినో టార్గెట్ చేస్తూ అన్నట్టుగా ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక పూనమ్ కౌర్ సినీ కెరీర్ విషయానికొస్తే.. 'మాయాజాలం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాది భామ.. ఆశించిన మేర అవకాశాలు అందుకోలేకపోయింది. తెలుగులో ఇప్పటివరకు 'ఒక విచిత్రం' 'సౌర్యం' 'వినాయకుడు' 'ఈనాడు' 'నాగవల్లి' 'గగనం' 'ఆడుమగాడ్రాబుజ్జి' 'పొగ' 'సూపర్ స్టార్ కిడ్నాప్' 'ఎటాక్' 'నెక్స్ట్ ఏంటి' వంటి చిత్రాల్లో పూనమ్ నటించింది. కొంత విరామం తర్వాత చివరగా 'నాతి చరామి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.