Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ కు సుప్రీం హీరో ఆడియో మెసేజ్
By: Tupaki Desk | 25 Nov 2021 4:57 AM GMTసాయి ధరమ్ తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. జీ5 యాప్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మొట మొదటి సారిగా ఈ సినిమాను దర్శకుడి వాయిస్ ఓవర్ తో సన్నివేశాల వివరణతో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి స్ట్రీమింగ్ దక్కలేదు. సినిమా రెండు వర్షన్ ల్లో ఉంటుంది. ఒకటి దర్శకుడి వాయిస్ ఓవర్ తో సాగేది కాగా మరోటి నార్మల్ గా ఉంటుంది. ప్రేక్షకులు ఏ వర్షన్ చూడాలనుకుంటే ఆ వర్షన్ ను చూడవచ్చు అంటూ జీ5 వారు చెబుతున్నారు.
రిపబ్లిక్ సినిమాను 26వ తారీకు నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ ను కూడా భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. మరో సారి సినిమా గురించి వివరించారు. అలాగే ఓటీటీలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవ్వబోతున్న వాయిస్ ఓవర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఓటీటీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ సినిమా ను ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్రమోషన్ లో భాగంగా తన వాయిస్ ను వినిపించాడు. తన అభిమానులకు ఒక ఆడియో మెసేజ్ ను విడుదల చేయడం జరిగింది.
ఆ ఆడియో మెసేజ్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. నేను మీ సాయి ధరమ్ తేజ్. నా పై మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు థాంక్స్. రిపబ్లిక్ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. జీ 5 ఓటీటీలో నవంబర్ 26న విడుదల అవుతోంది. సినిమా చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి జై హింద్ అన్నాడు. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో రిపబ్లిక్ సినిమా విడుదల సమయంలో ఆయన ప్రమోషన్స్ కు హాజరు అవ్వలేక పోయాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కాని ఇంకొన్నాళ్ల పాటు ఇంటికే సాయి ధరమ్ తేజ్ పరిమితం అవ్వాలని కుటుంబ సభ్యుల సూచన. అందుకే సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ఓటీటీ ప్రమోషన్ కు ఆడియో మెసేజ్ ను ఇవ్వడం జరిగింది.