Begin typing your search above and press return to search.
ఆ ఫైటర్లను సత్కరించనున్న సుప్రీమ్
By: Tupaki Desk | 7 May 2016 3:23 PM GMT''సుప్రీమ్'' సినిమా రెండు రోజుల్లో 5.75 కోట్లు 'షేర్' వసూలు చేసిందంటే మాటలు కాదు. సినిమా ఎలా ఉన్నా కూడా.. జనాలకు మాత్రం కామెడీ పిచ్చపిచ్చగా నచ్చేసినట్లుంది. దానితో సాయధరమ్ తేజ్ పండగ చేసుకుంటున్నాడు. ఈ సందర్బంగా రేపు సాయంత్రం సక్సెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు.
మ్యాటర్ ఏంటంటే.. సుప్రీమ్ సినిమాలో సెకండాఫ్ లో ఒక వినూత్నమైన ఫైట్ ఉంది. ఇందులో కొందరు వికలాంగులైన బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. ఎక్కువ శాతం కాళ్లు అవటితనం ఉన్నవారు.. ఎంతో మానసకి స్థైర్యంతో ఎలా ఉంటున్నారనే విషయం దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఫైట్ ద్వారా చూపించాడు. వాళ్లందరూ కూడా బాడీ బిల్డర్లే. ఫైట్ ఆద్యంతం వెంట్రుకలు నిక్కపొడిచే రేంజులో ఉంటుంది. ఇక రేపు సాయంత్రం జరుగనున్న సక్సెస్ మీట్ లో ఈ వికలాంగులను ''సుప్రీమ్'' టీమ్ సత్కరించనుందట.
ఒక్కోసారి కమర్షియల్ సినిమాలు మసాలా తప్పించి ఏమీ చూపించట్లేదు అనుకుంటాం కాని.. ఇలా డిఫరెంట్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ను కమర్షియల్ సినిమాలో చూపించి.. వారిని తిరిగి ఇలా గౌరవించడం అనేది పెద్ద విషయమే.