Begin typing your search above and press return to search.

అతడెవరని అడిగితే.. మొహమాటం లేకుండా చెప్పేసిన సురేఖ కుమార్తె

By:  Tupaki Desk   |   18 Jan 2022 4:11 AM
అతడెవరని అడిగితే.. మొహమాటం లేకుండా చెప్పేసిన సురేఖ కుమార్తె
X
సుప్రిత అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. సినీ నటి సురేఖవాణి కుమార్తె అన్నంతనే ఆమెను ఇట్టే గుర్తుకు వచ్చేస్తుంది.

తల్లికూతుళ్ల కంటే కూడా చూడచక్కని స్నేహితులుగా కనిపించే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హుషారుగా వీడియోలు పోస్టు చేసే సుప్రిత.. తాజాగా తన అభిమానులతో కలిసి చిట్ చాట్ చేసింది.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ మొహమాటం పడకుండా.. సూటిగా అడిగేవాడు.

ఎవరతను? అంటూ ఫోటోలో సుప్రితతో పాటు ఉన్న కుర్రాడి గురించి అడిగేశాడు. దీనికి అంతే స్మార్ట్ గా రియాక్టు అయ్యింది సుప్రిత. ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండా? బాయ్స్ లో బెస్టీగా అని అడిగితే.. స్పందించిన సుప్రీత.. ‘‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు.కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్ ఫ్రెండ్స్’’ అని చెప్పేసింది.

అమ్మాయి అంటే ఇలా ఉండాలి.

ఏదో దాచి పెట్టుకున్నట్లుగా చెప్పి.. చెప్పనట్లుగా సమాధానలు ఇవ్వటం అందరిని ఆకట్టుకుంటోంది. అప్పటివరకు సరదాగా ఉన్నట్లు ఉంటూ.. ఏదైనా పర్సనల్ క్వశ్చన్ అడిగినంతనే.. ప్రశ్న దాటేయటమో.. కోపగించుకోవటమో చేయకుండా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసిన తీరు అందరిని ఆకట్టుకునేలా ఉందని చెప్పక తప్పదు.