Begin typing your search above and press return to search.
అక్కినేని మనమరాలికి ఆ మాత్రం పొగరుండాలిలే
By: Tupaki Desk | 23 Aug 2018 5:49 AM GMTకొన్ని విషయాలంతే.. కాలమే పరిష్కరిస్తుందంటారు. ఒకప్పుడు గుట్టుగా ఉంచిన విషయాలు.. కొంత కాలం తర్వాత తియ్యటి స్మృతులుగా ఉండటమే కాదు.. అప్పటి పట్టుదలలు చిన్నపిల్లల వ్యవహారంగా అనిపిస్తాయి. ఒకప్పుడు ఎంత గట్టిగా తమ తీరును సమర్థించుకున్న వారు సైతం కాలం పుణ్యమా అని.. అప్పట్లో అలా ఉండకుండా ఉండాల్సింది. అంత రియాక్షన్ అవసరం లేదేమో? అన్నట్లుగా స్పందిస్తుంటారు.
తాజాగా అలాంటి ఆసక్తికర ఉదంతం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కినేని మనమరాలిగా సుపరిచితులు.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సుప్రియ. ఈ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పట్లో ఈ కాంబినేషన్ మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.
అక్కినేని మనమరాలు.. చిరంజీవి సోదరుడు ఇద్దరితో సినిమానా? అన్న ఆశ్చర్యం చాలామందిలో పెంచి.. ఈ సినిమా మీద బోలెడంత ఆసక్తికరచర్చ నడిచింది. అయితే.. ఈ సినిమా తర్వాత సుప్రియ అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాల్లో మునిగిపోయారు. సినిమాల్లో నటించలేదు. తాజాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన గూఢచారి మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అలీ నిర్వహించే ఒక కార్యక్రమానికి వచ్చిన ఆమె.. ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. అందులో ఒకటి అక్కినేని-దాసరి మధ్య గొడవలు మరింత ముదరటానికి తాను కూడా కారణమన్న భావనను వ్యక్తం చేసి.. అందుకు దారి తీసిన నాటి పరిస్థితుల గురించి వెల్లడించారు.
తాను పద్దెనిమిదేళ్ల వయసులో అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు చేపట్టానని.. అప్పట్లో అన్ని విషయాల్లోనూ కఠినంగా ఉండేదానినని చెప్పారు. పెద్ద వాళ్ల విషయంలో ఎలా మాట్లాడాలో అప్పట్లో తనకు అంతగా తెలిసేది కాదన్నారు. అప్పుడు కాస్త దూకుడుగా ప్రవర్తించానేమోనని తనకు అనిపిస్తుందన్నారు.
తన చిన్నప్పుడు తాత అక్కినేనికి.. దాసరికి మధ్య మంచి స్నేహం ఉండేదని.. వారి మధ్య పెద్ద విబేధాలు ఏమున్నాయో తనకు తెలీదని.. కానీ విభేదాలు మరింత ముదరటానికి మాత్రం తాను చిత్ర పాత్ర పోషించినట్లుగా చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ సమయంలో కొన్ని బిల్లుల విషయంలో సుప్రియ కఠినంగా వ్యవహరించారని.. అది దాసరి- అక్కినేని మధ్య విభేదాల్ని పెంచటమే కాదు.. చివరకు ఒకే సభకు హాజరైనా ముఖముఖాలు చూసుకోవటానికి కూడా ఇష్టపడే వారు కాదన్న ప్రచారం జరిగింది.
ఈ గొడవలు ఎంతవరకూ వెళ్లాయంటే.. దాసరి సతీమణి మరణించినప్పుడు కనీసం ఫోన్లో పరామర్శ కూడా అక్కినేని కానీ ఆయన వారసులు ఎవరూ చేయలేదన్న టాక్ ఉంది.
ఇదిలా ఉంటే.. తాత.. దాసరి మధ్య విభేదాలకు తానూ చిన్న పాత్ర పోషించినట్లు ఒప్పుకున్న సుప్రియ మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. దాసరి మరణించటానికి ఏడాది ముందు ఆయనతో తనకో అవసరం ఏర్పడిందని.. అర్థరాత్రి 12 గంటల సమయంలో తాను దాసరి ఇంటికి వెళ్లినట్లుగా చెప్పారు. లోపలకు వెళ్లిన తర్వాత ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయానని.. వచ్చావా:.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనమరాలంటే ఆ మాత్రం పొగరుండాలిలే.. కూర్చో అంటూ వ్యాఖ్యానించటమే కాదు.. ఏం తింటావని అడిగారని.. ఆయన తన సమస్యను పరిష్కరించినట్లుగా చెప్పారు. తన పట్టుదలతో పాటు.. దాసరి మంచితనాన్ని చెప్పే ప్రయత్నం చేసిన సుప్రియ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాసరి గొప్పతనాన్ని మరింత పొగిడేలా చేశాయని చెప్పక తప్పదు.