Begin typing your search above and press return to search.

పవన్ కష్టం చూసి సుప్రియ కన్నీళ్లు!

By:  Tupaki Desk   |   22 Aug 2018 4:47 PM GMT
పవన్ కష్టం చూసి సుప్రియ కన్నీళ్లు!
X
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో కథానాయికగా పరిచయమైన అమ్మాయి సుప్రియ. ఐతే ఆ ఒక్క సినిమాతోనే ఆమె కెరీర్‌కు బ్రేక్ పడిపోయింది. ఐతే ఇన్నేళ్ల తర్వాత ఆమె మళ్లీ ‘గూఢచారి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి స్పందనే వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుప్రియ తన తొలి సినిమా సంగతుల్ని పంచుకుంది. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ చేతుల మీదికి కార్లు ఎక్కించుకునే సన్నివేశం తనకు కన్నీళ్లు తెప్పించిందని చెప్పింది.

‘‘ పవన్ జెంటిల్‌ మ్యాన్. మా తొలి సినిమా సమయంలో తెగ సిగ్గుపడిపోతూ ఉండేవారు. ఆ సినిమా కోసం పవన్‌ చాలా కష్టపడ్డాడు. చేతులపై కార్లు ఎక్కించుకుని, ఛాతీపై రాళ్లు పగలకొట్టించుకొని చాలా శ్రమ తీసుకున్నాడు. ఆయన చేతులపై కార్లు ఎక్కించుకునే సీన్ అన్నపుడు డూప్‌ను పెట్టి లేదా - కెమెరా ట్రిక్‌ తో మేనేజ్ చేస్తారేమో అనుకున్నా. కానీ నిజంగా కార్లు వచ్చాయి. ఒక దాని తర్వాత మరొకటి చేతులపై ఎక్కేశాయి. అది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. కొద్దిసేపు నాకేమీ అర్థం కాలేదు. ఇక ఆ సినిమా చిత్రీకరణ సందర్భంగా పవన్ నాకు కోపం తెప్పించాడు కూడా. ఆ టైంలో ప‌వ‌న్ కూలింగ్ గ్లాస్‌ పెట్టుకుని యాక్ట్ చేసేవాడు. దీంతో నాకు ఆయ‌న ఎక్స్‌ ప్రెష‌న్ క‌నిపించేది కాదు. నేను ఎక్కువ టేక్‌ లు తీసుకునేదాన్ని. నాకు చాలా కోపం వ‌చ్చేది. నువ్వు క‌ళ్ల‌జోడు తీసి న‌టించు అంటూ ప‌వ‌న్‌ తో గొడ‌వప‌డేదాన్ని’’ అని సుప్రియ చెప్పింది.