Begin typing your search above and press return to search.

మొదటి హీరోయిన్ గా మాత్రమే చేస్తా

By:  Tupaki Desk   |   9 March 2018 4:25 AM GMT
మొదటి హీరోయిన్ గా మాత్రమే చేస్తా
X

కొన్ని సినిమాల్లో విలన్ గా చేసినా - తర్వాత హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. కొందరు కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరో అయిపోయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ సెకండ్ హీరోయినుగా కొన్ని సినిమాలు చేసి మెయిన్ హీరోయిన్ అయిపోయిన వారిని తక్కువమందినే చూశాం.

పోనీ మొదలు పెట్టింది సెకండ్ హీరోయినుగా అయితే తరువాత పెర్ఫార్మెన్స్ కానీ అందం కానీ ఎర వేసి హీరోయిన్ అయిపోవచ్చు. కానీ ఒక్కసారి హీరోయినుగా చేసి.. ఆ తరువాత సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసుకుంటూ పోతే మాత్రం ఇంకా హీరోయిన్ అవకాశాలు అందని ద్రాక్షలాగానే మిగిలిపోతాయి. ఇందులో నిజం ఎంత అంటే మనం చెప్పలేకపోవచ్చు కానీ టాలీవుడ్ లో ఒక అమ్మాయి మాత్రం ఇది అక్షరాలా సత్యం అని నమ్మి వచ్చిన ఆఫర్లు అన్నీ వెనక్కి పంపేస్తోంది. ఆమే సురభి. బీరువా అనే సినిమా తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆపై ఎక్సప్రెస్ రాజా లో నటించి మొన్ననే 'ఒక్క క్షణం'తో మనల్నిపలకరించింది ఈ ఢిల్లీ చిన్నది. కొంచెం బొద్దుగా ఉన్నాసరే నటనలో పెద్ద ఎత్తిచూపేంతటి తప్పులేం చేయట్లేదు. కానీ ఇప్పుడు ఈమెకు అన్ని సెకండ్ హీరోయిన్ అవకాశాలే వస్తున్నాయంట.

మొన్నకాక మొన్న రాశి ఖన్నా - నితిన్ జంటగా నటిస్తున్న శ్రీనివాస కల్యాణంలో రెండో హీరోయినుగా అవకాశం వస్తే నేను హీరోయినుగా మాత్రమే చేస్తాను అని ఆ అవకాశాన్ని పక్కకు తోసేసింది. రామ్ - అనుపమ నటిస్తున్న హలో గురు ప్రేమ కోసమేరా అనే సినిమాలో కూడా చెయ్యను అని తెగేసి చెప్పేసింది. ఈమె ఆలోచనలో కూడా కొంత నిజం ఉంది కానీ ఎన్నాళ్ళని హీరోయిన్ పాత్రే కావాలని ఎదురు చూస్తూ కూర్చుంటుంది? అంతమంచి సినిమాలు ఇప్పుడు ఈమెకు ఎవరిస్తున్నారు? లెటజ్ సీ.