Begin typing your search above and press return to search.
ఆ నటిని మరణానికి తాను కారణం కాదన్న నటుడు
By: Tupaki Desk | 31 Oct 2019 8:58 AM GMTబాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. బాలీవుడ్ నటుడు సూరజ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆమె.. తర్వాతి కాలంలో తన ఇంట్లోనే ఉరి వేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. తన కుమార్తె మరణానికి బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ అంటూ జియా తల్లి ఆరోపించటం.. కేసు నమోదు చేయటం తెలిసిందే. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. జియా మరణించి ఏడేళ్లు అవుతున్నా.. ఇప్పటికి తనకు న్యాయం జరగలేదని వాపోతున్నాడు సూరజ్.
జియా సూసైడ్ వ్యవహారంలో తనదే తప్పంతా అన్నట్లు మీడియా రాసిందని.. ఈ వ్యవహారంలో మీడియాలో వచ్చినవన్ని అబద్ధాలే అన్నాడు. తాను జియాను చంపలేదని.. ఆమె తల్లి చెప్పిన మాటల్ని విన్న వారంతా తన గురించి తప్పుగా అనుకుంటున్నారన్నారు.
అసలేం జరిగిందని తనను ఏ ఒక్కరూ అడగలేదని.. నిజం కోర్టు ద్వారా తెలుస్తుందన్న ఉద్దేశంతో తాను కూడా ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. తాను అమాయకుడినన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసులో నిజమేంటో తెలియాలని తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
కానీ.. మీడియా తనకు న్యాయం జరగనివ్వలేదన్న సూరజ్.. ఏడేళ్లు అవుతున్నా కోర్టులో ఇంకా తీర్పు రాకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసు కారణంగా తాను మాత్రమే కాదు.. తన కుటుంబం కూడా చాలా బాధ పడుతుందన్న అతడు.. జియా తల్లి తీరును తప్పు పట్టారు.
ఆమెకు బ్రిటిష్ పాస్ పోర్ట్ ఉందని.. సరిగ్గా కోర్టులో తన వాదన వచ్చే సమయానికి బ్రిటన్ వెళ్లిపోతున్నారని.. దీంతో కేసు విచారణ జాప్యం జరుగుతోందన్నారు. తన మీద కేసు పెట్టిన జియా తల్లి కోర్టుకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. బ్రిటిష్ పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన తాను ఏమైనా చేయగలనని అనుకోవటం సరికాదన్నారు. తనపై లేనిపోని నిందలు వేసి తప్పించుకు తిరగటం సబబు కాదన్న అతను.. కోర్టు నుంచి తనకు న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.