Begin typing your search above and press return to search.

గ్లామర్ డోస్ పెంచుతున్న బబ్లీ గాళ్‌

By:  Tupaki Desk   |   19 Oct 2017 4:54 AM
గ్లామర్ డోస్ పెంచుతున్న బబ్లీ గాళ్‌
X
గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుందామని ఇండస్ట్రీకి వచ్చినా హోమ్లీ పాత్రలతోనే కనిపిస్తోంది నటి సురభి. నాజూకైన అందాలు.. చిరునవ్వులు చిందే మోముతో కనిపించే ఈ సుందరాంగిని ఇంతవరకు ఎక్స్ పోజింగ్ చేయమని అడిగిన డైరెక్టరే లేకపోయాడు. ఆమె హీరోయిన్ గా నటించిన జెంటిల్ మెన్ - ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు హిట్టయినా సురభికి ప్రత్యేకమైన గుర్తింపేం రాలేదు. ఎట్టకేలకు పక్కింటమ్మాయి తరహా పాత్ర కాకుండా గ్లామర్ రోల్ వచ్చిందని సురభి ఉబ్బితబ్బిబ్బయిపోతోంది.

అల్లు శిరీష్ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో సురభి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూపించని అందాలతో ప్రేక్షకులకు కనువిందు చెయ్యాలని ఈ భామ డిసైడయిపోయిందిట. ‘‘ఇంతవరకు సురభికి వచ్చిన పాత్రలన్నీ ఒకే తరహావి వచ్చాయి. దాంతో అవే చెయ్యక తప్పలేదు. ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తుంది. ఇందుకోసం ముంబై నుంచి ఓ స్టయిలిస్ట్ ను కూడా పిలిపించుకుందని’’ సురభి సన్నిహితుడు ఒకరు తెలిపారు.

ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ గా సీరత్ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే సీరత్ బికినీ డ్రస్సుల్లో హాట్ హాట్ ఫోజులతో ఫిలిం మేకర్స్ దృష్టి తనపై పడేలా చేసుకుంది. సీరత్ తాజాగా నటించిన రాజుగారి గది-2 సినిమాలోనూ అందాలు వెండితెరపై ఆరబోసింది. అలాంటి సీరత్ సినిమాలో ఉన్నప్పుడు సాదాసీదాగా కనిపిస్తే సురభిని ఎవరు గుర్తిస్తారు. అందుకే గ్లామర్ డోస్ బాగా పెంచడానికి రెడీ అయిపోయినట్టుంది.