Begin typing your search above and press return to search.

సురేఖ వాణి రెండోపెళ్లి వార్త‌లు.. తీవ్రంగా హ‌ర్ట్ అయిన న‌టీమ‌ణి!

By:  Tupaki Desk   |   8 March 2021 7:48 AM GMT
సురేఖ వాణి రెండోపెళ్లి వార్త‌లు.. తీవ్రంగా హ‌ర్ట్ అయిన న‌టీమ‌ణి!
X
టాలీవుడ్ లో సింగ‌ర్ సునీత‌, దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న త‌ర్వాత‌.. ఇక సురేఖ వాణి కూడా అదే బాట‌లో ప‌న‌య‌నించ‌బోతున్నారంటూ కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌చారం మ‌రీ తీవ్ర‌మ‌వ‌డంతో దీనిపై స్పందించిన సురేఖ వాణి.. అలాంటిదేమీ లేద‌ని ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ ప్ర‌చారం ఆగ‌క‌పోవ‌డంతో తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆమె కూతురు కూడా తీవ్రంగా స్పందించింది.

సురేఖ వాణి భ‌ర్త రెండేళ్ల క్రితం చ‌నిపోయాడు. అప్ప‌టి నుంచి త‌న కూతురు సుప్రిత‌తో క‌లిసి ఒంట‌రిగానే జీవిస్తోందీ న‌టి. అయితే.. ప్ర‌త్యేక‌గా సునీత రెండో పెళ్లి తర్వాత సురేఖ వాణిని టార్గెట్ చేశారు ప‌లువురు. ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతోంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

ఒకసారి క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. మ‌ళ్లీ మ‌ళ్లీ అవే వార్త‌లు ప్ర‌చారం చేస్తుండ‌డంపై సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రిత‌ ఘాటు స్పందించారు. తానే రెండో పెళ్లి గురించి చెప్పిన‌ట్టుగా వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. త‌న‌కు కేవ‌లం ఇన్ స్టా అకౌంట్ మాత్ర‌మే ఉంద‌ని, ఫేస్ బుక్ లో చేసిన ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని క్లారిటీ ఇచ్చారు సురేఖ‌. రెండో పెళ్లి అనేదాంట్లో నిజం లేద‌ని చెప్పింది.

తాజాగా.. ఓ మీమ్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ‘‘సురేఖ వాణి రెండో పెళ్లి అంట‌.. అయితే.. ముందు వ‌ర‌స‌లో నేనుంటా’’ అని అందులో ఉంది. ఈ మీమ్ ను షేర్ చేసిన సురేఖ‌.. ఇదంతా ఫేక్ న్యూస్ అని రాసింది. అనుమ‌తి లేకుండా ఎవ‌రి జీవితాల్లోకి ప్ర‌వేశించొద్ద‌ని సూచించింది.

ఇక‌, ఆమె కూతురు సుప్రిత ఘాటు స్పందించింది. ఉన్న‌వి రాయండి.. లేనివి క్రియేట్ చేసి రాయ‌కండి.. మీరు జ‌ర్న‌లిస్టులు అనుకోకండి అంటూ ఫైర్ అయ్యింది. మొత్తానికి ఈ వార్త‌లు సురేఖ ఫ్యామిలీని తీవ్రంగా హ‌ర్ట్ చేశాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక‌నైనా, ఈ ప్ర‌చారానికి తెర ప‌డుతుందేమో చూడాలి.