Begin typing your search above and press return to search.

వీడియో : అప్పటి విమర్శలు సరిపోలేదా ఆంటీ

By:  Tupaki Desk   |   7 Feb 2020 5:29 AM GMT
వీడియో : అప్పటి విమర్శలు సరిపోలేదా ఆంటీ
X
కొన్నాళ్ల క్రితం సురేఖ మరియు ఆమె కూతురు ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో తల్లి కూతురు ఇద్దరు కూడా మరీ పొట్టి డ్రస్‌ లు వేసుకున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తల్లి కూతురు ఇలాగేనా ఉండేది అంటూ చాలా మంది కామెంట్స్‌ చేయడం తో అప్పట్లో ఆ వీడియోలను సోషల్‌ మీడియా నుండి తొలగించాలని సురేఖ చాలా ప్రయత్నాలు చేసినట్లు గా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే తరహా వీడియోను సురేఖ పోస్ట్‌ చేసింది.

ఈమద్య కాలంలో కూతురుతో కలిసి సురేఖ టిక్‌ టాక్‌ వీడియోలు తెగ చేస్తుంది. అందులో భాగంగానే అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్‌ కు కూతురుతో కలిసి డాన్స్‌ చేసింది. తల్లి కూతురు తో కలిసి డాన్స్‌ చేయడం లో పెద్ద వింతేమీ లేదు. కాని ఆ సమయంలో వారిద్దరి కాస్ట్యూమ్స్‌ పై ఇప్పుడు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మోకాలకు పైకి ఉన్న డ్రస్‌ తో సురేఖ తొడలు పూర్తిగా కనిపించేలా ఆమె కూతురు డ్రస్‌ చేసుకుని చేసిన బుట్టబొమ్మ డాన్స్‌ వైరల్‌ అయ్యింది.

పాట ఎంత వైరల్‌ అవుతుందో అంతే స్థాయిలో వారిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఒక తెలుగు కుటుంబం కు చెందిన వారు అయ్యి ఉండి ఇలాంటి డ్రస్‌ లు ఏంటీ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు మాత్రం వారికి సపోర్ట్‌ గా నిలుస్తున్నారు. మొత్తానికి సురేఖ మరియు ఆమె కూతురు బుట్టబొమ్మ వీడియో సోషల్‌ మీడియా ను షేక్‌ చేసి వదిలి పెడుతుంది.