Begin typing your search above and press return to search.
అలాంటి వారిని దూరం పెడితేనే హ్యాపీ: నటి సురేఖావాణి కామెంట్స్
By: Tupaki Desk | 29 March 2021 1:30 PM GMTతెలుగు చిత్రపరిశ్రమలో బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అందులో ఒకరు సురేఖావాణి. ఇప్పటివరకు ఆమె వందల సినిమాలలో నటించింది. అయితే సినిమాలలో తెలుగుదనం నిండిన పాత్రలతో అలరించే సురేఖావాణి.. ఎక్కువగా ఓ తల్లి, అక్క, వదిన, నర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా పోషించింది. నిజానికి సురేఖావాణిలో కేవలం తెలుగుదనం మాత్రమే కాదు.. ఆమెలో నేటి తరం మోడ్రన్ మదర్ కూడా ఉంది. ఎందుకంటే సురేఖావాణి సోషల్ మీడియాలో చేసే సందడి చూసినట్లయితే అర్ధమవుతుంది. కొంతకాలంగా సినిమాలలో తక్కువగా కనిపిస్తోంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో కూడా చక్కగా చీరకట్టుతో కనిపిస్తుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సినిమాల్లో నటించే పాత్రలకు, నిజజీవితానికి ఎంతో తేడా ఉంటుంది. సురేఖా కూడా అలాగే జీవిస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఆమె మోడ్రన్ డ్రెస్సులతో వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోస్, వీడియోస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. సురేఖావాణి తన ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు తన కూతురుతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అయితే కూతురిని ఎంత మోడ్రన్ గా పెంచుతుందో.. ఆమె కూడా అంతే మోడ్రన్ మదర్ అనిపించుకుంటుంది. కానీ సోషల్ మీడియా బాధితులలో సురేఖ కూడా ఒకరు. ఆమెపై ఎల్లప్పుడూ ఏదొక గాసిప్ లేదా న్యూస్ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇదివరకే భర్తను కోల్పోవడమే జీవితంలో చాలా పెద్దలోటు అని చెప్పిన సురేఖావాణి.. తాజాగా ఒట్టిమాటలు చెప్పేవారిని, నకిలీ మనుషులను దూరం పెడితేనే హ్యాపీగా ఉంటామని చెప్పుకొచ్చింది. మరి ఎవరిని ఉద్దేశించి చెప్పిందో కానీ ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే సురేఖా కూతురు సుప్రిత సినిమాల్లోకి రానుందని టాక్. చూడాలి మరి కూతురును హీరోయిన్ చేస్తుందేమో!