Begin typing your search above and press return to search.

త‌న‌ని తిట్టినోళ్ల‌కు న‌టి డాట‌ర్ కోటింగ్

By:  Tupaki Desk   |   10 Jun 2019 6:37 PM GMT
త‌న‌ని తిట్టినోళ్ల‌కు న‌టి డాట‌ర్ కోటింగ్
X
సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో నెటిజ‌నులు త‌మ అభిప్రాయాన్ని సూటిగా చెప్పేయ‌డం బావుంది కానీ.. మ‌రీ హ‌ద్దు మీరి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్లోకి వెళ్లిపోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సెల‌బ్రిటీల్ని మ‌రీ హ‌ర్ట‌యిపోయేలా తిట్టేయ‌డం.. మ‌న‌సు గాయ‌ప‌ర‌చ‌డం లాంటి బ్యాడ్ ట్రెండ్ న‌డుస్తోంది. అయితే ఇక్క‌డా రెండు కోణాలు. ఒక్కోసారి సెల‌బ్రిటీల వైపు నుంచి కొన్ని త‌ప్పులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. త‌ప్పు చేసి నెటిజ‌నుల‌కు దొరికితే ఆడేసుకుంటున్నారు. అలా కాకుండా త‌ప్పు చేయ‌క‌పోయినా చీవాట్లు తినే స‌న్నివేశం ఇబ్బందిక‌రంగా మారింది.

ఇందులో ఆ రెండో ర‌కం ట్రీట్ మెంట్ ఎదురైంది న‌టి సురేఖ‌ వాణి డాట‌ర్ సుప్రీత‌కు. ఈ చిన్నారి బేబి రెగ్యుల‌ర్ గా సామాజిక మాధ్య‌మాలు స‌హా.. వీడియో షేరింగ్ సైట్ టిక్ టాక్ లో ట‌చ్ లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌క‌ర‌కాల వీడియోల్ని అప్ లోడ్ చేస్తూ అభిమానుల సంఖ్య‌ను పెంచుకుంటోంది. అందులో ఫ‌న్ తో కూడుకున్న‌వి వాటితో పాటు ఎమోష‌న్ తో కూడుకున్న‌వి ఉన్నాయి. అయితే ఇదే వేదిక‌పై త‌న తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు త‌ల‌కొరివి పెట్టిన వీడియోల్ని షేర్ చేయ‌డంతో నెటిజ‌నులు త‌మ‌కు తోచిన కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఛాన్స్ దొర‌కాలే కానీ.. అన్న‌ట్టుగా తిట్టేశారు. దీంతో సురేఖ వాణి & డాట‌ర్ మ‌న‌సు గాయ‌ప‌డిందిట‌.

అందుకే త‌మ‌ను తిట్టిన వాళ్ల‌కు స‌మాధానం అదే ర‌కంగా ఇచ్చారు ఆ ఇద్ద‌రూ. తాజాగా ఓ మెసేజ్ లో ట్రోల‌ర్స్ ని ఉద్ధేశించి సుప్రీత ఘాటైన కామెంట్ ని పోస్ట్ చేశారు. ``మాపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నవారు అలా చేసేముందు అన్నీ తెలుసుకోవాలి. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మ‌న‌ల్నే చూపిస్తాయ‌న్న‌ది గుర్తెర‌గాలి. ముందు నీ లైఫ్ జాగ్ర‌త్త. త‌ర్వాత ఇత‌రుల విష‌యాల్లో వేలు పెట్టండి. నువ్వు నీవైపు నుంచే చూస్తున్నావ్‌. అలా కాదు నా వైపు నుంచి చూడు. నా కోణంలో ఆలోచించు`` అంటూ ఫుల్ గా క్లాస్ తీస్కుంది. ఆ త‌ర్వాత త‌న ఇన్ స్టాగ్ర‌మ్ ఖాతా కూడా మాయ‌మైంది. భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత ఆ వ్య‌ధ‌ నుంచి త‌న త‌ల్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంద‌ని సుప్రీత వెల్ల‌డించింది.