Begin typing your search above and press return to search.

వ్వాట్‌! మామ్ అండ్ డాట‌ర్ షాంపెయిన్ పార్టీ?

By:  Tupaki Desk   |   15 Aug 2021 9:30 AM
వ్వాట్‌! మామ్ అండ్ డాట‌ర్ షాంపెయిన్ పార్టీ?
X
క్యారెక్ట‌ర్ న‌టి సురేఖావాణి సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ అసాధార‌ణం. నేటిత‌రం క‌థానాయిక‌ త‌ర‌హాలోనే సురేఖావాణి కూడా భారీగా అనుచ‌రుల‌ను క‌లిగి ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లోని గ్లామ‌ర్ యాంగిల్ ని ఫోటోలు వీడియోల రూపంలో ఎలివేట్ చేయ‌డం తెలిసిన‌దే. లాక్ డౌన్ స‌మయంలో సురేఖా వాణి సోష‌ల్ మీడియాలో మరింత‌గా ఫాలోవ‌ర్స్ ని పెంచుకున్నారు. నిరంత‌ర యోగా జిమ్ సెష‌న్స్ కి సంబంధించిన‌ వీడియో లు... డ్రెస్సింగ్ రూమ్ ఫోటోల‌ను అప్ డేట్ చేస్తూ న‌వ‌త‌రం నాయిక‌ల‌కు ఎంత మాత్రం తీసిపోన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. అలాగే సురేఖావాణి డాట‌ర్ సుప్రీత‌కు సంబంధించిన ఫోటోల్ని సైతం మీడియాలోకి వ‌దిలి సునామీ సృష్టించారు.

త‌ల్లి కూతుళ్లిద్ద‌రు ఒకే ర‌క‌మైన డ్రెస్ కోడ్ తో చాలాసార్లు క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక సుప్రిత బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌ల్లీకూతుళ్లిద్ద‌రు ప‌ర్స‌న‌ల్ గా ఇంట్లో ఎలా ఎంజాయ్ చేసారో తెలిసిందే. పార్టీ నుంచి స్ప‌ష‌ల్ ఫోటోల్ని అభిమానుల‌తో పంచుకుని జిగేల్మ‌నిపించారు. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ఇద్ద‌రిని ప‌క్క ప‌క్క‌నే చూసి త‌ల్లీకూతుళ్లా- అక్కాచెల్లెళ్లా అనే డౌట్లు పుట్టించేయ‌డం ఆ ఇద్ద‌రికే చెల్లింది. ఇక సుప్రిత జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న స్నేహితుల‌తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన‌ట్లు తాజా ఫోటోల్ని బ‌ట్టి తెలుస్తోంది.

స్నేహితులంతా క‌లిసి మ‌ద్యం తో ఆస్వాధ‌న తెలుస్తోంది. మ‌ద్యం బాటిల్ ని సుప్రీత‌ చేతిలోకి తీసుకుని స్నేహితుల‌కు మీద‌కు పొంగించారు. అలాగే ఓ షాంపేన్ బాటిల్ ని కూడా పొంగించి చిలౌట్ చేయ‌డం క‌నిపిస్తోంది. పార్టీ నైట్ అంతా ప్రెండ్స్ గ్యాంగ్ తో సుప్రీత ఫుల్ గా ఎంజాయ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో త‌ల్లి సురేఖా వాణి కూడా చేరిపోయి చిన్న‌ వ‌య‌సులోకి ప‌ర‌కాయం చేశార‌ట‌. సుప్రీత‌- సురేఖ ఇద్ద‌రు స‌మ‌యం దొరికిందంటే విదేశీ ప్ర‌యాణాలు కూడా బాగానే చేస్తారు. సురేఖ వాణికి షూటింగ్ లు లేక‌పోతే కుమార్తెతోనే టైమ్ పాస్. ఒక స్నేహితురాలిలా ఎంజాయ్ చేస్తారని చాలా సంద‌ర్భాల్లో రుజువైంది.