Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: వీడియో విడుదల చేసిన సురేఖావాణి!
By: Tupaki Desk | 25 Jun 2023 5:07 PM GMTటాలీవుడ్ లో డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే! ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయంటూ కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో... కేపీ చౌదరి ఫోన్ కాల్ లిస్టులో పలువురి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయని తెలుస్తుండగా... అందులో సురేఖావాణి పేరు కూడా ఉందని వార్తలొచ్చాయి!
అలా కేపీ చౌదరి ఫోన్ లో ఫోన్ నెంబర్స్ లో పేరు ఉన్న సినిమా స్టార్స్ పై ప్రముఖంగా మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో కేపీ చౌదరితో వారు సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై ఒక్కొక్కరూ బయటకువచ్చి తమ వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా నటి సురేఖావాణి తాజాగా స్పందించారు.
గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలకు స్పందిస్తూ సురేఖావాణి మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు.
"గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయుంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, ఫ్యూచర్, మా పిల్లల కెరీర్, నా కుటుంబం ఆరోగ్యం.. ఇలా అన్నిరకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి" అని సురేఖావాణి ఈ వీడియోలో చెప్పారు.
కాగా... కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటకు రావడం నిజమా కాదా.. ఆ ఫోన్ నెంబర్ ఆమెదేనా కాదా.. అని నిర్ధరించుకునేలోపు.. కేపీ చౌదరి బుగ్గపై ఈమె ముద్దు పెడుతున్న ఫొటో ఒకటి ప్రత్యక్షమైంది. దీన్ని ప్రముఖ మీడియా ఛానల్ లు సైతం ప్రసారం చేశాయి. దీంతో... ఆ సమయంలో ఆమె మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ఉందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
అయితే తమపై వస్తోన్న ఆరోపణలకు తమకూ ఎలాంటి సంబంధం లేదంటూ.. ఈ వార్తలను పరోక్షంగా ఖండిస్తూ సురేఖావాణి మీడియాకు తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు.