Begin typing your search above and press return to search.
సురేఖవాణి డాటర్ కి చిర్రెత్తికొచ్చింది!
By: Tupaki Desk | 1 Jun 2022 12:30 AM GMTక్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి- ఆమె ముద్దుల కుమార్తె సుప్రిత సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. ఇద్దరు తల్లీ-కూతుళ్లు అయినా అక్కా చెల్లి లా మెలుగుతారు. అందంగా ముస్తాబవ్వడం దగ్గర నుంచి నెటి జనులతో ముచ్చటించడం వరకూ ఎంతో యాక్టివ్ గా పాల్గొంటారు. ఇన్ స్టా రీల్స్ చేయడం...వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేయడం..అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ నిర్వహించడం ప్రతీది ఎంతో యాక్టివ్ గా కొనసాగిస్తారు.
విమర్శలొస్తే అదే స్థాయిలోనూ తిప్పికొట్టగల నేర్పరితనం తల్లీ-కూతుళ్ల సొంతం. అప్పుడప్పుడు ట్రోలర్లకి దొరికిపోయినా వాటిపైనా తమదైన శైలిలో స్పందిచి కౌంటర్లు వేస్తుంటారు. సాధారణంగా ట్రోల్స్ విషయంలో చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఈ మామ్-డాటర్ మాత్రం వాటిని కూడా వదిలిపెట్టరు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రిత గూబ పగిలిపోయేలా కౌంటర్ ఇచ్చే సరికి ప్రత్యర్ధికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆన్ లైన్ లోకి వచ్చిన సుప్రిత అడగండి ప్రశ్నలు అంటూ నెటి జనుల్ని కోరింది. దీనికి ఓ అభిమాని మీ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. దీంతో సుప్రితకి చిర్రెత్తుకొచ్చింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని ప్రకాష్ రాజ్ ఫేమస్ డైలాగ్ ఇవే తగ్గతించుకుంటే మంచిది అని స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఆ ప్రశ్న అడగగానే మరో ఆలోచన లేకుండా సుప్రిత అలా రియాక్ట్ అయింది. దీంతో పెళ్లి విషయం ఎత్తితే ఇంతగా ఫీల్ అవుతారా? అన్న సంగతి అడిగిన వాళ్లకి అర్ధమైంది. సుప్రిత తల్లిలా సినిమా రంగంలోకి రాణించాలని ఎంతో ఆశపడుతుంది. దీనిలో భాగంగా సురేఖ వాణి కుమార్తె కోసం ఎంతో బ్యాకెండ్ వర్క్ చేస్తుంది. చివరికి ఎలాగూ `లేచింది మహిళా లోకం` సినిమాలో అవకాశం దక్కించుకుంది.
ఈ ఛాన్స్ సురేఖా వాణి కారణంగానే వచ్చింది. ఇండస్ర్టీలో తనకున్న పరిచయాలు వాడుకుని కుమార్తెని ఆ సినిమాలో పెట్టించింది. ఇకపై మాత్రం నిరూపించుకోవాల్సింది సుప్రితనే. ఎంట్రీ వరకూ ఎవరైనా చేయగలరు సహాయం. ఆ తర్వాత ప్రతిభతోనే రాణించాలి. మరి యువ భామ ఎంతటి ప్రతిభావంతురాలో చూద్దాం.
అందం..అభియనం లో తల్లిని మించిన బ్యూటీ సుప్రిత అనడంలో ఎలాంటి అతి లేదు. అందుకే సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఉంది. నటి కాక ముందే యువత మనసు దోచేస్తున్న బ్యూటీ నటిగా బిజీ అయితే ఆమ్మడి వేగాన్ని తట్టుకోగలమా? అన్న సందేహం వస్తుంది.
`లేచించి మహిళా లోకం` సినిమాలో సుప్రతి పాత్ర చిన్నదే అవుతుంది. ఇందులో లీడ్ రోల్ మంచు లక్ష్మి పోషిస్తుంది. కార్తీక్-ఆర్యన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. హరితేజ్ ..హేమ.. శ్రద్దాదాస్ తో పాటు సుప్రిత నటిస్తుంది. ఇటీవలే సినిమా టైటిల్ లుక్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి సుప్రిత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా? లేక తల్లి తరహాలోనే సహాయ నటి గా సరి పెట్టుకుంటుందా? అన్నది చూడాలి.