Begin typing your search above and press return to search.
ప్రొడ్యూసర్ వేటలో మెగా డైరెక్టర్..!!
By: Tupaki Desk | 18 Aug 2020 12:37 PM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ఇప్పటివరకు చాలానే సూపర్ హిట్ సినిమాలను రూపొందించాడు. ఆయన వద్ద మరో విశేషం ఏంటంటే.. సినిమా క్వాలిటీ విషయంలో అసలు కంప్రమైస్ కాకపోవడం. క్వాలిటీ విషయంలో సురేందర్ రెడ్డి పేరే ముందు వరుసలో వినిపిస్తుంది. సినిమా హిట్ కానీ ప్లాప్ కానీ క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తాడు. ఇక ఆయన చివరగా డైరెక్ట్ చేసిన సినిమా 'సైరా నరసింహరెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రూపొందించిన ఈ పాన్ ఇండియా సినిమా.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక పోయింది. సైరా సినిమాకు సురేందర్ ప్రశంసలు, విమర్శలు రెండు అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. చాలాకాలంగా సురేందర్ ఎదుర్కొంటున్న ప్రశ్న.. తదుపరి సినిమా ఎవరితో..? అని. ఎందుకంటే సైరా గతేడాది అక్టోబర్ నెలలో విడుదలైంది.
అప్పటి నుండి ఇప్పటి వరకు తన తర్వాత సినిమా ఏ హీరోతో.. అసలు సినిమా ఏంటి..? అనేది ఇంతవరకు చెప్పలేదు సురేందర్. నిజమే మరి దాదాపు పది నెలలు గడుస్తున్నా తన తదుపరి సినిమా గురించి చెప్పకపోవడం నిరాశ కలిగించే విషయమే. అయితే తాజాగా అక్కినేని అఖిల్ తో ఓ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమాకు దాదాపు 45కోట్లు బడ్జెట్ అవుతుందని చెప్పాడట. డైరెక్టర్ క్రిష్ తన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చి బడ్జెట్ చెప్పగానే వెనకడుగు వేశారని టాక్. అయితే ప్రస్తుతం సురేందర్ రెడ్డి సరైన నిర్మాత కోసం వెతుకుతున్నాడు. అలాగే ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరికి కూడా సురేందర్ స్క్రిప్ట్ వినిపించాడట. ఇక సురేందర్.. లాక్ డౌన్లో పవన్ కళ్యాణ్ కోసం కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేసాడట. అది గనక ఓకే అయితే అఖిల్ తో సినిమా పక్కన పెట్టేస్తాడట. లేదంటే అఖిల్ తోనే కంటిన్యూ అవుతాడని సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. చూడాలి మరి సురేందర్ ఏం న్యూస్ అందించనున్నాడో..!!