Begin typing your search above and press return to search.

వీరిద్దరి కాంబినేషన్ డబుల్ కిక్కిస్తుందా..?

By:  Tupaki Desk   |   21 Aug 2015 2:36 AM GMT
వీరిద్దరి కాంబినేషన్ డబుల్ కిక్కిస్తుందా..?
X
సాధారణంగా కాంబినేషన్ అన్న పదం వినగానే దర్శకుడు-హీరో, హీరో-హీరోయిన్ అనే అందరి మెదల్లలోనూ మెదులుతుంది. రచయిత దర్శకుడు కాంబినేషన్ కూడా ఒకటి వుంది అనేది చాలా తక్కువ మందికి గానీ గుర్తుకురాదు. కథా రచయితగా వక్కంతం వంశీ, దర్శకుడిగా సురేందర్ రెడ్డి తొలిసారి అశోక్ సినిమాతో ఒకే వేదికపైకి వచ్చారు. దర్శకుడిగా సురేందర్ రెడ్డికి ఇది రెండో సినిమా అయితే వంశీకిదే తొలి చిత్రం. సురేందర్ రెడ్డి కథ రాసుకున్నది తన తొలి సినిమా అయిన అతనొక్కడే కి మాత్రమే. తర్వాత చేసిన సినిమాలన్నీ వక్కంతం కథలే. అందులో కిక్ ఇద్దరికీ ప్రత్యేకం. ఈ సినిమా దర్శకుడిగా సురేందర్ రెడ్డి స్థాయిని పెంచితే, వంశీని స్టార్ రైటర్ ని చేసింది.

ఇదిలా వుంటే వ్యక్తిగతంగా జయాపజయాలు ఇద్దరికీ వున్నాయి. వీరిద్దరి కలయికలోనూ అశోక్ - అతిథి - కిక్ - ఊసరవెల్లి - రేసుగుర్రం లాంటి అయిదు రాగా అందులో రెండు హిట్లు. మూడు ఫట్లు. కాన్సెప్ట్ బాగున్నా సినిమాలు ఆడలేదు. గత విజయాలతో మంచి ఊపు మీదున్న దర్శక, రచయితలిద్దరికీ ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే మరి కాస్త కంఫర్ట్ గా ఫీలవుతారు. కిక్ 2 ఫలితం మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది. కిక్ సినిమా ఫలితం కిక్ 2పై సహజంగానే అంచనాలను పెంచేసింది. కంఫర్ట్ కాన్సెప్ట్ మరోసారి ప్రేక్షకులకు కిక్ ఇస్తుందని చిత్ర బృందం నమ్మకం. ఆ నమ్మకం నిజం కావాలని, వీరిద్దరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని కోరుతూ కిక్ 2 సినిమాకి తుపాకీ.కామ్ తరపున ఆల్ ది బెస్ట్.