Begin typing your search above and press return to search.

ఊసరవెల్లి.. అతడి బెస్ట్ మూవీ అట

By:  Tupaki Desk   |   7 Dec 2016 11:30 AM GMT
ఊసరవెల్లి.. అతడి బెస్ట్ మూవీ అట
X
‘అతనొక్కడే’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన సురేందర్ రెడ్డి.. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అశోక్’ ఆడలేదు. అయినప్పటికీ ఇదే కాంబినేషన్లో మరో సినిమా మొదలైంది. అదే ‘ఊసరవెల్లి’. తొలిసారి తమ కాంబినేషన్లో వచ్చిన సినిమా సరిగా స్కోర్ చేయలేకపోయిందని.. ఈసారి సిక్సర్ కొట్టేస్తున్నామని కాన్ఫిడెంటుగా చెప్పాడు ఎన్టీఆర్. కానీ ఈ సినిమా కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. యావరేజ్ టాక్ తో మొదలై.. ఫ్లాప్ గా నిలిచింది.

ఐతే ‘ఊసరవెల్లి’ ఎలాంటి ఫలితాన్నిచ్చినప్పటికీ అదే తన కెరీర్లో బెస్ట్ ఫిలిం అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ‘‘ఊసరవెల్లి అంతగా సక్సెస్ కాకపోయి ఉండొచ్చు కానీ.. నా కెరీర్లో అదే బెస్ట్ ఫిల్మ్’’ అని ఖరాఖండిగా చెప్పాడు సురేందర్. అతనొక్కడే.. కిక్.. రేసుగుర్రం లాంటి సినిమాల్ని కాదని ‘ఊసరవెల్లి’నే తన బెస్ట్ ఫిల్మ్ అని సురేందర్ చెప్పడం విశేషమే. ఇక కెరీర్లో తొలిసారి ‘ధృవ’ రూపంలో రీమేక్ సినిమా చేయాల్సి రావడం గురించి చెబుతూ.. ‘‘కిక్-2 త‌ర్వాత చ‌ర‌ణ్ తో సినిమా చేయ‌డం కోసం కొన్ని రోజులుగా ట్రావెల్ అవుతుండగా.. ఒక‌రోజు చ‌ర‌ణ్ తన కోసం ‘త‌నీ ఒరువన్’ సినిమా చూడ‌మ‌న్నారు. చూసిన త‌ర్వాత ఎలా ఉంది.. నేను చేయ‌చ్చా అని అడిగాడు. చేయొచ్చని చెప్పాను. ఐతే ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అని అడిగితే నా అభిప్రాయం చెప్పాను. ఆ సంభాషణ ముగిశాక మరి నువ్వే ఈ సినిమా చేయొచ్చు కదా అన్నాను. ఆయన అలా అంటారని ఊహించలేదు. దీంతో నాకు రెండు రోజులు సమయం కావాలని చెప్పాను. ముందు కొంచెం టెన్షన్ పడినా.. తర్వాత ఓకే చెప్పాను’’ అని సురేందర్ తెలిపాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/