Begin typing your search above and press return to search.

ఈ కాపీ కథ కొత్తగా ఉందే!!

By:  Tupaki Desk   |   9 Jan 2018 10:45 AM GMT
ఈ కాపీ కథ కొత్తగా ఉందే!!
X
లార్గో వించ్.. ఈ ఫ్రెంచ్ సినిమా గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు మొత్తానికి తెలిసిపోయింది. ఓ ఫ్రెంచ్ మూవీ గురించి తెలుగు ఆడియన్స్ చర్చించుకోవడం ఇదే మొదటిసారి. ఇందుకు ఆ సినిమాలో కంటెంట్ కంటే.. పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసిని.. ఈ కథ ఆధారంగానే తీశారనే ప్రచారం జరగడమే ఇందుకు కారణం.

లార్గోవించ్ ఇండియన్ రీమేక్ రైట్స్ టీ సిరీస్ దగ్గర ఉండడం.. కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడం.. ఆ తర్వాత అజ్ఞాతవాసి మేకర్స్ తో చర్చలు.. సెటిల్మెంట్ జరిగిపోవడంతో అంతా సద్దుమణిగింది. త్రివిక్రమ్ లార్గో వించ్ ను కాపీ కొట్టేసి కథ తయారు చేసుకున్నాడని అంటున్నారు కానీ.. ఇదేమీ కొత్త సినిమా కాదు. ఈ ఫ్రెంచ్ సినిమా రిలీజ్ అయి దాదాపు పదేళ్ల సమయం అవుతోంది. దానికి సీక్వెల్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను లో కూడా లార్గో వించ్ లోని ఒకట్రెండ్ సీన్స్ ఉంటాయట. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కన్ను కూడా ఈ చిత్రంపై గతంలోనే పడిందని అంటున్నారు.

సన్నిహితులతో పిచ్చాపాటీ కబుర్లలో భాగంగా ఈ విషయం స్వయంగా చెప్పాడట సైరా డైరెక్టర్. లార్గోవించ్ లైన్ ఆధారంగా ఓ కథ రాసుకుని.. బన్నీకి చెబ్దామని భావించాడట. రేసుగుర్రం తర్వాత ఈ ప్రాజెక్టే చేయాలని అనుకున్నాడట. కానీ నాన్నకు ప్రేమతో మూవీ ఇదే కాన్సెప్ట్ అని అనుకుని.. ఆ ప్లాన్ నుంచి డ్రాప్ అవగా.. ఇప్పుడు అజ్ఞాతవాసి మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ చూసి.. తను ఆ పని చేయకుండా ఉండడమే మేలు అయిందని అంటున్నాడట సురేందర్ రెడ్డి.