Begin typing your search above and press return to search.

సూరీ.. హార్టు వరకూ తీసుకోకయ్యా!

By:  Tupaki Desk   |   2 Sep 2015 1:50 AM GMT
సూరీ.. హార్టు వరకూ తీసుకోకయ్యా!
X
కిక్‌ 2 డిజప్పాయింట్ చేసింది. దర్శకుడు, హీరో, నిర్మాత ఈ ముగ్గురి మధ్యా కలతల్ని సృష్టించింది. ఇది ఫుల్‌ క్లారిటీతో అందరూ ఒప్పుకుంటున్న మాట. మొన్నటికి మొన్న మాస్‌ రాజా రవితేజ సూటిగా దర్శకుడిని విమర్శించాడు. సూరి నా మాట వినలేదు. చెప్పినట్టే కొన్ని సీన్లు కట్‌ చేసి ఉంటే తప్పకుండా హిట్టయ్యేదే... సురేందర్‌ రెడ్డి జడ్జిమెంట్‌ ని తప్పు పట్టాడు.

ఆ మాటకి అప్పుడు సమాధానం చెప్పకపోయినా .. అది సురేందర్‌ రెడ్డిని హర్ట్‌ చేసిందని తాజా సన్నివేశం చెబుతోంది. కిక్‌ 2 పోయినా కిక్‌ 3 తీసి తీరతానని మొండికేస్తున్న సురేందర్‌ రెడ్డి అన్నంత పనీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కిక్‌ 3 తెరకెక్కించి హిట్‌ కొట్టి తన పట్టుదలను నెగ్గించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అంతే కాదు.. అసలు రవితేజ లాంటి ఏజ్డ్‌ హీరోని పెట్టుకోవడం వల్లే కిక్‌2 కిక్కివ్వలేదని అతడు భావిస్తున్నాడుట. అందుకే ఈసారి ఓ యంగ్‌ హీరోతో కిక్‌3 తెరకెక్కించాలని అనుకుంటున్నాడు.

ఒక ఫెయిల్యూర్‌ ఎంత గడబిడ చేస్తోంది. అయినా బాసూ ఇలా హార్టుకు తీసుకోకు. మాస్‌ రాజా ఎప్పటికీ చెడ్డవాడు కాదు. ఇన్నేళ్ల కెరీర్‌ లో ఏనాడూ ఏ దర్శకుడినీ అననివాడు.. ఈరోజు అన్నాడంటే అతడు ఎంత హోప్‌ పెట్టుకున్నాడో ఓ మారు అర్థం చేసుకో. అంతా మన మంచికే అనుకోవాలంతే.