Begin typing your search above and press return to search.
యూరప్ ట్రిప్.. సూరికి చెర్రీ ఊహించని గిఫ్ట్
By: Tupaki Desk | 9 Sep 2019 11:48 AM GMTయూరప్ పర్యాటకుల స్వర్గధామం అన్న సంగతి తెలిసిందే. యూరప్ లో ఎన్నో ఎగ్జోటిక్ లొకేషన్స్ కళ్లు చెదరగొడతాయి. అక్కడే స్పెయిన్ ఇబిజలోని అందమైన లొకేషన్ల గురించి టాలీవుడ్ జనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా స్పెయిన్ ఇబిజలో అక్కినేని ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో మునిగి తేలింది. అయితే అలాంటి స్పెషల్ లొకేషన్ కి వెళ్లి కుటుంబ సమేతంగా జాలీగా స్పెండ్ చేసేందుకు సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ఆఫర్ దొరికిందట. అది కూడా సైరా నిర్మాత రామ్ చరణ్ తనే స్వయంగా ఈ ట్రిప్ ని స్పాన్సర్ చేస్తున్నారని తెలిసింది.
స్పెయిన్ సహా యూరఫ్ లో ఎగ్జోటిక్ లొకేషన్లలో జాలీ ట్రిప్ వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఎంతో అడ్వాన్స్ డ్ గా విమానం టిక్కెట్లు బుక్ చేసేశారట. సూరి తన కుటుంబంతో ఈ విజిట్ కి వెళ్లేందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేశారు. రాను పోను ఖర్చులే కాదు..అక్కడ హోటల్స్ లో బసలు సహా ప్రతిదీ ఎరేంజ్ చేశారు. సైరా కోసం రేయింబవళ్లు అలుపన్నదే తెలీకుండా ఎంతగానో శ్రమించిన సూరీకి చెర్రీ ఇచ్చిన గిఫ్ట్ ఇదని చెబుతున్నారు. సూరి కష్టానికి కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇది. `సైరా`కి అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చిన అతడి పనితనానికి మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ ద్వయం ఎంతో హ్యాపీ ఫీలవుతున్నారని అందుకే ఈ అరుదైన కానుకలు అందుతున్నాయని తెలుస్తోంది. ఇంతకుముందు సురేందర్ రెడ్డి కుమారుని బర్త్ డే సందర్భంగా ఓ గుర్రాన్ని కానుకగా ఇచ్చి చరణ్ సర్ ప్రైజ్ చేశారు. అలానే ధృవ రిలీజ్ సమయంలోనూ సూరికి చరణ్ కానుకల్ని ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా `సైరా-నరసింహారెడ్డి` చిత్రాన్ని దాదాపు 270 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. పాన్ ఇండియా కేటగిరీలో తెలుగు- హిందీ- తమిళం-మలయాళం-కన్నడలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దాదాపు 10వేల స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది.