Begin typing your search above and press return to search.
చిరు కోసం అలాంటి కథ!!
By: Tupaki Desk | 18 Jan 2017 5:00 AM GMTమెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సెన్సేషన్స్ ఇంకా పూర్తి కాలేదు. సరిగ్గా చెప్పాలంటే రికార్డుల వేట ఇప్పుడే మొదలైందంతే. ఈ వీకెండ్ తో పాటు రిపబ్లిక్ డే వీకెండ్ లో కూడా ఖైదీకి కాసుల పంట ఖాయం అంటున్నారు ట్రేడ్ జనాలు. అయితే.. చిరు 150 రికార్డుల వేట ఇంకా పూర్తి కాకుండానే.. 151కి సంబంధించిన పనులు మొదలైపోతున్నాయి.
స్టోరీ ఏంటి అనే విషయం డిసైడ్ కాలేదు కానీ.. చిరంజీవి నెక్ట్స్ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కిక్.. రేసుగుర్రం లాంటి చిత్రాలతో పాటు.. రీసెంట్ గా రామ్ చరణ్ కి ధృవ లాంటి విభిన్నమైన చిత్రాన్ని అందించి తన క్రియేటివిటీని.. స్టైలిష్ ప్రెజెంటేషన్ ను చూపించాడు సురేందర్ రెడ్డి. అయితే.. చిరంజీవి కోసం స్క్రిప్ట్ విషయంలో సూరి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. కంప్లీట్ గా ఎంటర్టెయిన్మెంట్ ఉండే కథనే సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. గతంలో వక్కంతం వంశీతో కలిసి కథలు వర్కవుట్ చేసిన ఈ దర్శకుడు.. కిక్2 ఫ్లాప్ తర్వాత యంగ్ రైటర్స్ తో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిరు 151వ సినిమాని సూరి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పైనే నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ఫైనల్ కావడం ఆలస్యం.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/