Begin typing your search above and press return to search.
ధృవ ఈవెంట్: ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు
By: Tupaki Desk | 5 Dec 2016 3:51 AM GMT''మనకు కనపడే చరణ్ వేరు. తన హార్ట్ వేరు. ఇందులో చాలా మీనింగ్ ఉంది. నేను ఊహించలేదు తను ఇలా ఉంటాడని. ఈ సినిమా తరువాత నాకు ఒక మంచి హీరోయే కాదు.. ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు చరణ్ రూపంలో'' అంటూ సెలవిచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మొత్తానికి కిక్ 2 సినిమాతో కాస్త ఢీలా పడ్డ దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఇప్పుడు తన స్టామినా ప్రూవ్ చేసుకునేందుకు భారీ ఎత్తునే దండయాత్ర చేస్తున్నాడు. రీమేక్ సినిమా ''ధృవ''తో వస్తున్నప్పటికీ.. ఈ సినిమాను మనోడు చేంజ్ చేసిన తీరు ట్రైలర్లు - టీజర్లు చూస్తే అర్ధమవుతోంది. అయితే ఈ సినిమా గురించి ఆదివారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సురేందర్ రెడ్డి ఏమంటున్నాడంటే..
''ఇది రెగ్యలుర్ సినిమా కాదు. కొత్తగా ఉంటుంది. చరణ్ ఇష్టపడి ఈ ప్రాజెక్టు సెలక్ట్ చేసుకున్నాడు. సెలక్ట్ చేసుకుని నాకు ఇచ్చాడు. ఎంతో డెడికేటెడ్ గా తను ఈ సినిమా కోసం పనిచేశాడు. ఈ సినిమాను ఇచ్చినట్లే.. ఒక మంచి ప్రొడ్యూసర్ ను కొందరు మంచి టెక్నీషియన్లను కూడా ఇచ్చాడు. వారిని చరణ్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్ ఉండేది కాదు'' అని చెప్పాడు. ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్.. ఆర్ట్ డైరక్టర్ రాజీవన్.. అలాగే మ్యూజిక్ డైరక్టర్ హిప్ హాప్ తమిళ.. అలాగే నా నిర్మాతలు.. అద్భుతంగా సహాయపడ్డారని కూడా చెప్పాడు సూరి.
ఇకపోతే సురేందర్ రెడ్డి సినిమా గురించి తక్కువ మాట్లాడి.. తన టాలెంట్ ఏంటో డిసెంబర్ 9న వెండితెర మీద చూసుకోవాలని చెప్పకనే చెప్పాడు మరి. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/