Begin typing your search above and press return to search.
షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. సురేష్ బాబు కూడా
By: Tupaki Desk | 2 Sep 2016 5:30 PM GMTటాలీవుడ్లో మరో షార్ట్ ఫిలిం కాంటెస్ట్ తెరమీదికి వచ్చింది. సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రోత్సాహంతో హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. మూడు నుండి పది నిమిషాల వ్యవథిలో లఘు చిత్రాలు రూపొందించవచ్చు. ఈ పోటీలకు డి.సురేష్ బాబు.. రామ్మోహన్ రావు.. తరుణ్ భాస్కర్.. అవరసరాల శ్రీనివాస్ జ్యూరీ సభ్యులుగా ఉంటారు.
పోటీలో పాల్గొనే వాళ్లు p511shortfilm@gmail.com మెయిల్ కు తమ లఘుచిత్రాల్ని పంపాలి. సెప్టెంబర్ 20 లోపు ఎంట్రీలు పంపాలి. అక్టోబర్ 9న వీటిని జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్ లో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ.. సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ పోటీలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. షార్ట్ ఫిల్మ్ ఏ భాషలో అయినా తీయొచ్చు. ఈ కాంటెస్ట్ విజేతకు 50 వేల రూపాయలు.. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేలు ఇస్తారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘పాఠశాలల్లో కనీస అవసరాలు తీర్చడానికి తమ వంతు కృషి చేస్తున్న ప్రాజెక్ట్ 511 సంస్థ చేపడుతున్న మంచి పోటీ ఇది. ఎవరైనా మంచి స్క్రిప్టుతో ముందుకు వస్తే వారికి మా స్టూడియో ద్వారా కెమెరాలను ఉచితంగా అందిస్తాం’’ అన్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఐదారు షార్ట్ ఫిలిం కాంటెస్టులు నడుస్తుండటం విశేషం. సుకుమార్.. మారుతి లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ పోటీల్లో భాగస్వాములవుతున్నారు.