Begin typing your search above and press return to search.
గజగజ ఒణికిపోతున్న అగ్రనిర్మాత.. కారణమిదే!
By: Tupaki Desk | 23 May 2020 1:30 AM GMTథియేటర్లు తెరిస్తే నష్టమా? లాభమా? జనం థియేటర్లకు వస్తారా రారా? ఇదీ కరోనా కష్టకాలంలో హాట్ డిబేట్. ఈ ప్రశ్నకు పరిశ్రమ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు ఇచ్చిన ఆన్సర్ పెద్ద షాక్ కి గురి చేసింది.
"మెడిసిన్ కనిపెట్టకుండా తెరిచేస్తే జనం థియేటర్లకు వస్తారా రారా?" అన్నది పెద్ద సమస్య. వైన్ షాపులకొచ్చినట్టు థియేటర్లకు రారు! అని సురేష్ బాబు అన్నారు. ఏదీ చెప్పలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అయినా థియేటర్లు తెరిచేస్తే జనం వచ్చేస్తారని అనుకున్నా.. అక్కడ ఒకవేళ తేడాలొస్తే నడ్డి విరిగిపోద్ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన టైమ్ కి మాత్రమే థియేటర్లు తెరవాలని సురేష్ బాబు అన్నారు.
భారతదేశంలో 10 వేల థియేటర్లు.. మన రాష్ట్రాల్లో 2 వేల థియేటర్లు చిక్కుల్లో ఉన్నాయని అన్నారు. ఓటీటీల్లో రిలీజ్ లకు వెళితే వీరంతా సమస్యల్లో పడతారని అన్నారు. ఆశతో బతుకుతున్నారు థియేటర్ ఓనర్లు.. సిబ్బంది. అందరూ చాలా సమస్యల్లో ఉన్నారని తెలిపారు.
ఏడాది వరకూ థియేటర్ కి వచ్చే సీన్ లేదు కదా? అని ప్రశ్నిస్తే.. ఏడాది పాటు ఇలానే ఉంటే చాలా కష్టం. ప్రభుత్వాల తరపు నుంచి సపోర్ట్ లేకపోతే ఇంకా కష్టం. ఓటీటీలకు కథలు చెప్పి బతికేయొచ్చేమో కానీ.. థియేటర్ వ్యవస్థ బతకాలంటే చాలా సమస్యలున్నాయని సురేష్ బాబు అన్నారు.
జనం భయం వదిలి థియేటర్లకు వచ్చినా సామాజిక దూరం పాటిస్తూ చూడాలన్న నియమం ఉంది. తక్కువ మంది ఉంటే ఆనందం వినోదం ఏం ఉంటుంది. రెవెన్యూ కూడా రాదు. అసలు రెవెన్యూ రాకపోతే ఇంకెందుకు థియేటర్లు? ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనే వస్తుందని సురేష్ బాబు అన్నారు. ఆర్నెళ్లు అయినా సంవత్సరం అయినా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నది చెప్పలేం. వ్యాక్సిన్ వస్తేనే కానీ చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
సినిమా అనేది ఇంటర్ లింక్ బిజినెస్ .. తీవ్ర పరిణామాలు ఉంటాయని సురేష్ బాబు సందేహం వ్యక్తం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్.. షూటింగులు.. థియేటర్లు ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ లింక్ ఉన్నవని .. ఏది ఎఫెక్ట్ అయినా కాస్ట్ పెరుగుతుందని సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.