Begin typing your search above and press return to search.
సురేష్ బాబు అసంతృప్తి వల్లే 'వెంకీమామ' లేట్
By: Tupaki Desk | 21 Oct 2019 9:56 AM GMTమామ అల్లుడు మల్టీస్టారర్ 'వెంకీ మామ' ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని దగ్గుబాటి ప్యాన్స్ మరియు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్.. నాగచైతన్యలు నిజ జీవిత పాత్రల్లోనే అంటే మామ అల్లుడు పాత్రల్లోనే కనిపించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం విడుదల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. చాలా రోజులుగా అదుగో ఇదుగో అంటూ విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు.
దసరా.. దీపావళి.. క్రిస్మస్ ఇప్పుడు సంక్రాంతికి వెంకీ మామ అంటున్నారు. ఈ సినిమా సేఫ్ జోన్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో సురేష్ బాబు వాయిదా వేస్తున్నారని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. కాని ఇటీవల సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాస్త సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుందట. ఆ సీజీ వర్క్ క్వాలిటీగా రావాలనే ఉద్దేశ్యంతో ఆలస్యం చేస్తున్నారని టాక్. మొదట ఒక కంపెనీ చేసిన సీజీ వర్క్ కు సురేష్ బాబు సంతృప్తి చెందక పోవడంతో మరో ప్రముఖ కంపెనీతో గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారట.
సినిమా ఆలస్యం అయినా పర్వాలేదు కాని క్వాలిటీ ఔట్ పుట్ ను తీసుకు రావాలని.. ఈ ప్రాజెక్ట్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు చాలా ప్రతిష్టాత్మకం అవ్వడం వల్ల సురేష్ బాబు ఎక్కడ రాజీ పడటం లేదనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే గ్రాఫిక్స్ వర్క్ ను పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను తీసుకు రావాలని భావిస్తున్నారట. త్వరలోనే విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.