Begin typing your search above and press return to search.
రివర్సులో నోటీసులిస్తున్నారు -డి.సురేష్ బాబు
By: Tupaki Desk | 2 Nov 2015 11:30 AM GMTచెట్టు ముందా విత్తు ముందా .. అన్నట్టే .. పరిష్కారమే లేని సమస్యగా మారిపోయింది పైరసీ. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పైరసీ మహమ్మారీని నిలువరించలేకపోతున్నారు. అయితే టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు మాత్రం పైరసీపై ఎప్పటికప్పుడు యుద్ధం ప్రకటిస్తూ వార్ నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పైరసీపై చాలా వరకూ విజయం సాధించారు. కానీ పూర్తి స్థాయిలో నిలువరించడం ఆయన వల్ల కూడా కాలేదు.
పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరినీ ఏకం చేసి, పోలీసులతో సంప్రదింపులు జరిపి మొన్నటిరోజున ఏకంగా తెలంగాణ ప్రభుత్వాధీశులతో ఆయన సుదీర్ఘ మంతనాలు సాగించారు. పైరసీ మహమ్మారీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన సురేష్‌బాబు అండ్ బృందం కొన్ని సీరియస్ నిర్ణయాల్ని తీసుకున్నారు. ఈ దీపావళి నుంచి పైరసీపై డేగ కన్ను వేసి ఉంచడానికి ఓ టీమ్ పనిచేస్తుంది. ఇందులో పరిశ్రమ వ్యక్తులతో పాటు పోలీసులు, ప్రభుత్వం ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది.
ఏటేటా పైరసీ వల్ల భారతీయ సినిమాకి దాదాపు రూ.90వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. కేవలం ఒక్క టాలీవుడ్ సినిమాకి దాదాపు రూ.350 కోట్ల నష్టం కలుగుతోందని డి.సురేష్ బాబు చెప్పారు. కంచె నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ .. పైరసీకి కారణం ఇంటి దొంగలే. ఇటీవలే నన్ను పైరసీ కంట్రోల్ టీమ్ మానిటరింగ్ కోసం నియమించారు. నాలుగైదు టీముల్ని పరిశీలించి ఒక టీమ్ ని ఎంపిక చేసుకున్నా. కాంట్రాక్ట్ వాళ్లకు ఇచ్చినందుకు మిగతావాళ్లు పైరేట్ లుగా మారరు అని గ్యారెంటీ ఏమిటి?
కంచె పైరసీ లింక్ ని కనిపెట్టి ఆ వెబ్ సైట్ ఓనర్ ని ప్రశ్నిస్తే.. చెన్నయ్ క్రైమ్ పోలీస్ నుంచి బెదిరిస్తున్నానంటూ నాకు ఎదురు నోటీసులు వచ్చాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? పరిశ్రమలో ఉన్న నిర్మాతలంతా ఏకమైతేనే పైరసీని నిలువరించగలం, 3 నుంచి 6 నెలలు కఠోర ధీక్ష చేపడితే ఇది అసాధ్యం కానేకాదు.. అంటూ చెప్పుకొచ్చారు. అదీ మ్యాటరు.