Begin typing your search above and press return to search.
సురేష్ బాబు తెలివే తెలివి కదా..?
By: Tupaki Desk | 5 Feb 2020 3:30 AM GMTసురేష్ ప్రొడక్షన్స్ లో ఒకప్పుడు రామానాయుడు ఎన్నో అద్బుతమైన చిత్రాలను నిర్మించారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. సినిమా నిర్మాతగా సురేష్ బాబు ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ను కూడా దక్కించుకున్నారు. అంతటి సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ మద్య కాలంలో చిన్నా చితకా సినిమాలు మాత్రమే వస్తున్నాయి. సురేష్ బాబు సోలోగా అసలు సినిమాలు నిర్మించడమే మానేసినట్లుగా అనిపిస్తుంది. ప్రతి సినిమాను కూడా చిన్న బడ్జెట్ తో అది కూడా ఇతర నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ఈయన కళ్లై పులి ఎస్ థానుతో కలిసి అసురన్ రీమేక్ 'నారప్ప'ను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంను సురేష్ బాబు చాలా తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయాలని భావిస్తున్నాడట. తక్కువ బడ్జెట్ తో పూర్తి చేసి తక్కువ రేటుకే అమ్మినా కూడా సినిమాకు మంచి లాభాలు దక్కుతాయి అనేది సురేష్ బాబు మాస్టర్ ప్లాన్ గా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
ఇక నారప్పకు శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా తీసుకోవడం వెనుక కూడా బడ్జెట్ వ్యూహమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాప్స్ లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల పారితోషికం విషయంలో పట్టింపులు చూపించకుండా సినిమాను తాను చెప్పినట్లుగా తీస్తాడనే ఉద్దేశ్యంతో.. తాను సూచించిన బడ్జెట్ లో పూర్తి చేస్తాడనే ఉద్దేశ్యంతోనే సురేష్ బాబు ఆయన్ను తీసుకుని ఉంటాడని అంటున్నారు.
కేవలం నారప్ప మాత్రమే కాకుండా ఇంకా ఇతర సినిమాల విషయంలో కూడా సురేష్ బాబు ఇదే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాడట. ఆ మద్య వచ్చిన చిన్న చిత్రాలను కోటి రెండు కోట్ల రూపాయల లోపులోనే పూర్తి చేసి మంచి లాభాలను ఈ నిర్మాత దక్కించుకున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి సురేష్ బాబుది తెలివే తెలివి ఏమంటారు..?