Begin typing your search above and press return to search.
ఇప్పట్లో షూటింగ్స్ స్టార్ట్ చేసే ఉద్దేశ్యం లేదంటున్న ప్రముఖ నిర్మాత...?
By: Tupaki Desk | 16 Jun 2020 11:10 AM GMTసినీ ఇండస్ట్రీ గత రెండున్నర నెలలుగా దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన మూతబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. కాకపోతే కొన్ని షరతులను నిబంధనలతో మాత్రమే చిత్రీకరణకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ మరియు సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని జీవోలు జారీ చేసాయి. దీంతో షూటింగ్స్ ఆపేసుకున్న చిత్రాలు చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే షూటింగ్స్ కి అనుమతిస్తున్నా పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ వలన చిత్రీకరణ ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది ప్రశ్నర్థకంగా మారింది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అంటే మాములు విషయం కాదని కొంతమంది ప్రొడ్యూసర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కూడా షూటింగ్స్ స్టార్ట్ చేసి రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడట.
ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళ్ 'అసురన్' రీమేక్ 'నారప్ప'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ - ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'నారప్ప' మిగతా షూటింగ్ కోసం మరికొన్ని రోజులు వేచి చూడాలని సురేష్ బాబు ఆలోచిస్తున్నాడట. అంతేకాకుండా రానా - గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కించాలనుకున్న 'హిరణ్య కశ్యప'.. 'సోను కే టిటు కి స్వీటీ' 'డ్రీమ్ గర్ల్' సినిమాలు కూడా లేట్ గానే పట్టాలెక్కించాలని సురేష్ బాబు అనుకుంటున్నారట. మొత్తం మీద సురేష్ బాబు కరోనా విజృంభిస్తున్న ఇలాంటి పరిస్థితులలో ఇతరుల ప్రాణాలను డేంజర్ లో పెట్టకూడదని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సినిమా షూటింగుల కంటే ప్రాణాలు ముఖ్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది 'ఓ బేబీ' 'వెంకీమామ' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న సురేష్ ప్రొడక్షన్స్ కి 'నారప్ప' ఎలాంటి రిజల్ట్ ని అందుకోబోతుందో చూడాలి.