Begin typing your search above and press return to search.

నష్టం వచ్చినా పర్వాలేదు మరో నాలుగు నెలలు వెయిట్‌ చేద్దాం

By:  Tupaki Desk   |   26 Aug 2020 2:30 PM GMT
నష్టం వచ్చినా పర్వాలేదు మరో నాలుగు నెలలు వెయిట్‌ చేద్దాం
X
కరోనా గురించి మొదట్లో ఉన్నంత భయం ఇప్పుడు లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా అనేది వచ్చి పోతుంది. చాలా మంది కరోనా వచ్చి పోతున్నట్లుగా కూడా తెలియడం లేదు. ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు కరోనాకు భయపడాలి. అంతే తప్ప చాలా మందికి అసలు కరోనా అనేది జలుబు పెట్టినంత ఇబ్బంది కూడా పట్టడం లేదు అనేది చాలా మంది మాట. అయితే ఇప్పటికి ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చాలా మంది షూటింగ్స్‌ కు రెడీ అవుతుంటే మరి కొందరు మాత్రం ఈ ఏడాదిలో షూటింగ్‌ లు మొదలు పెట్టే యోచనతో కనిపించడం లేదు.

వయసులో సీనియర్‌ లు అయిన వారు మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా భయంతో చాలా మంది స్టార్‌ హీరోలు షూటింగ్‌ లకు దూరంగా ఉంటూ వచ్చారు. మరికొన్నాళ్ల పాటు కూడా దూరంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. తక్కువలో తక్కువ ఈ ఏడాది చివరి వరకు అయినా ఉండాలని భావిస్తున్నారు. అప్పటి వరకు వ్యాక్సిన్‌ రావడం లేదంటే మరేదైనా ప్రత్యామ్నాయం రావడం జరుగుతుంది. అందుకే 2021 జనవరి వరకు వెయిట్‌ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ విషయంలో దగ్గుబాటి వారు చాలా సీరియస్‌ గా ఉన్నారు.

తమ హీరోలు షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వడం కాని తమ ప్రొడక్షన్‌ లో సినిమాలు షూటింగ్‌ కు వెళ్లడం కాని తమ ఆధీనంలో ఉన్న సినిమా థియేటర్లను కాని ఈ ఏడాదిలో తెరిచేందుకు కాని సురేష్‌ బాబు ఒప్పుకోవడం లేదు. 2021 వరకు వెయిట్‌ చేస్తామని అంటున్నారు. ఆర్థికంగా కోట్లు నష్టపోయే అవకాశం ఉన్నా కూడా పర్వాలేదు అన్న దోరణిలో సురేష్‌ బాబు ఉన్నాడట. ఇది ఒకందుకు మంచిదే కాని సినీ కార్మికులు పాపం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.