Begin typing your search above and press return to search.

ఆ రూమర్లపై బాబు నవ్వుకున్నారట

By:  Tupaki Desk   |   15 Jun 2018 8:24 AM GMT
ఆ రూమర్లపై బాబు నవ్వుకున్నారట
X
రూమర్స్ కి అవకాశం వస్తే ఏ విధంగా వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడు సంతోషంతో కనిపించే స్టార్స్ విషయంలో కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చినా హాట్ టాపిక్ అవుతాయి. ఇక వాళ్లు బాధలో ఉన్నారు అంటే కూడా సోషల్ మీడియాలో అనేక రకాల పుకార్లు వినిపిస్తాయి. ఇవి తారల వరకు వెళితే నవ్వుకోవడం తప్ప ఏమీ జరగదు. కొందరు పట్టించుకోకుండా ఉంటే మరికొందరు వెంటనే స్పందించి రూమర్స్ కి ఎండ్ చెప్పేస్తారు.

ఇటీవల దగ్గుబాటి ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని ఫ్యామిలీ లో ఎవరికి ప్రశాంతత లేదని సురేష్ బాబు బాధలో ఉన్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా రానా హెల్త్ గురించి అయితే చాలా రకాలుగా కామెంట్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా ఆ విషయాల గురించి ఇటీవల తెలుసుకున్న సురేష్ బాబు చాలా నవ్వుకున్నారట. దగ్గుబాటి సన్నిహితులు ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. హ్యాపీగా సినిమాలతో బిజినెస్ లతో బిజీగా ఉంటే అశాంతి అనారోగ్యం అనే రూమర్స్ ఏమిటని సురేష్ బాబు నవ్వుకున్నారట.

ప్రస్తుతం ఈ బడా ప్రొడ్యూసర్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో విడుదల కనుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పూర్తిగా కొత్తవారితో సినిమాను చేశారు. ఇక ఆ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉంటే ఇలాంటి రూమర్స్ రావడం నిజంగా బాధాకరమని మరికిందరు దగ్గుబాటి సన్నిహితులు చెబుతున్నారు. ఇక రానా పూర్తి ఫిట్ నెస్ తో తన సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.