Begin typing your search above and press return to search.

ర‌న్నింగ్‌ ఫ్లాప్ తో అలా డైల‌మాలోకి..

By:  Tupaki Desk   |   2 Jan 2020 1:30 AM GMT
ర‌న్నింగ్‌ ఫ్లాప్ తో అలా డైల‌మాలోకి..
X
వ‌రుస వైఫ‌ల్యాలు ఏ హీరోకి అయినా ఇబ్బందిక‌రమే. హిట్టును న‌మ్మే ప‌రిశ్ర‌మ మ‌న‌ది. అలాంటి చోట వ‌రుస‌గా అర‌డ‌జ‌ను ఫ్లాపులొచ్చాయంటే అది ఎంత టెన్ష‌న్ పెడుతుందో ఊహించేదే. అన్ని ఫ్లాపులొచ్చినా వ‌రుస‌గా అవ‌కాశాలిస్తున్నారు అంటే మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంకా హీరోగారి ప్ర‌తిభ‌ను న‌మ్మ‌డం వ‌ల్ల‌నే అని భావించాల్సి ఉంటుంది.

అదంతా స‌రే కానీ.. యంగ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ న‌టించిన తాజా చిత్రం `ఇద్ద‌రిలోకం ఒక‌టే` ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డం త‌న‌ని తీవ్రంగా నిరాశ‌పరిచింద‌ట‌. మంచి హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరి కాబ‌ట్టి ఈ చిత్రం విజ‌యం సాధిస్తుంద‌ని అనుకున్నాడు. కానీ అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఇంకొక్క‌టి. పైగా వ‌రుస‌గా త‌న‌కు అర‌డ‌జను ఫ్లాపులు ఎదుర‌య్యాయి. దీనివ‌ల్ల యువ‌హీరో పూర్తిగా నిరాశ‌లో కూరుకుపోయాడట‌. ఆ క్ర‌మంలోనే హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ డ్రీమ్ గ‌ర్ల్ తెలుగు రీమేక్ లో న‌టించాలా వ‌ద్దా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంద‌ట‌.

ఆయుష్మాన్ ఖురానా న‌టించిన డ్రీమ్ గ‌ర్ల్ హిందీలో బిగ్ హిట్. పూర్తిగా ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ ఉన్న చిత్ర‌మిది. తెలుగు వెర్ష‌న్ ని రాజ్ త‌రుణ్ హీరోగా తెర‌కెక్కించేందుకు డి.సురేష్ బాబు ఏర్పాట్ల‌లో ఉన్నారు. ఇప్ప‌టికే యువ‌హీరోపై ట్ర‌య‌ల్ షూట్ చేశారు. తెలుగు వెర్షన్ స్క్రిప్టు స‌హా క్యారెక్ట‌ర్ డిజైన్ పూర్తయింది. షెడ్యూల్స్ ని రెడీ చేశారు. కానీ రాజ్ త‌రుణ్ ఉన్న‌ట్టుండి సందిగ్ధంలో ప‌డ్డాడ‌ట‌. ఇప్ప‌డున్న డైల‌మాలో మ‌రో ప్ర‌యోగం చేయాలంటే కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌.

డ్రీమ్ గ‌ర్ల్ పూర్తి ప్ర‌యోగాత్మ‌క చిత్రం. అందులో హీరో పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఫీమేల్ వాయిస్ తో అప‌రిచితుల్ని మ‌భ్య పెట్టే యువ‌కుడిగా క‌నిపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాను ఉన్న ప‌రిస్థితుల్లో ఈ కాన్సెప్ట్ ఎక్కుతుందా? అన్న సందిగ్ధ‌త హీరో మైండ్ లో ఉందట‌. ఇటీవ‌ల క‌మ‌ర్షియ‌ల్ హిట్ అన్నదే లేదు. చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల్సిన టైమ్ ఇది. అందుకే ఈ డైల‌మా. అయితే ఇలాంటి టైమ్ లోనే అనుభ‌వ‌జ్ఞుడైన డి.సురేష్ బాబు రాజ్ త‌రుణ్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మ‌రి.