Begin typing your search above and press return to search.
సురేష్ బాబు వాదన సమర్థనీయమా?
By: Tupaki Desk | 7 Aug 2017 11:52 AM GMTఒకేసారి రెండు మూడు పేరున్న సినిమాలు రిలీజయ్యాయంటే థియేటర్లు కేటాయించే విషయంలో గొడవలు జరిగిపోతాయి టాలీవుడ్లో. పోయినేడాది దసరాకు.. ఈ ఏడాది సంక్రాంతికి ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయాల్లో థియేటర్ల కోసం నిర్మాతల మధ్య గట్టి పోటీ నెలకొంది. అంతర్గతంగా విభేదాలు కూడా తలెత్తాయి. ఇప్పుడు ఆగస్టు 15 ముందు రానున్న వీకెండ్ విషయంలోనూ ఇదే పోటీ కనిపిస్తోంది. ఆగస్టు 11న ‘నేనే రాజు నేనే మంత్రి’.. ‘జయ జానకి నాయక’.. ‘లై’ సినిమాలు విడుదలకు సై అంటున్నారు. ఈ మూడింట్లో ఏదో ఒక సినిమా రేసు నుంచి తప్పుకుంటుందని అనుకున్నారు. కానీ ఎవ్వరూ తగ్గట్లేదు. అదే వీకెండ్లో తమ సినిమాల్ని విడుదల చేయడానికే సిద్ధమైపోయారు.
ఈ పరిస్థితిపై ‘నేనే రాజు నేనే మంత్రి’ నిర్మాత సురేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పేరున్న సినిమాలు మూడు ఒకేసారి రావడం వల్ల థియేటర్ల సమస్య తలెత్తుతున్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు. కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గట్లేదని అన్నారు సురేష్ బాబు. తమ సినిమాను వాయిదా వేద్దామనుకున్నప్పటికీ అజిత్ సినిమా ‘వివేగం’ ఆగస్టు 10 నుంచి 25కు వాయిదా వేసిన నేపథ్యంలో రెండు భాషల్లో రిలీజవ్వాల్సిన సినిమా కాబట్టి 11కే విడుదల చేయక తప్పట్లేదని ఆయనన్నారు. ఐతే ఈ వాదన సమర్థనీయంగా అనిపించట్లేదు.
ఐతే నిజానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ని ముందు ఆగస్టు 4నే రిలీజ్ చేయాలనుకున్నారు. డేట్ కూడా ఇచ్చారు. కానీ తర్వాత ఇండిపెండెన్స్ డే వీకెండ్ అయితే కలెక్షన్లు పెరుగుతాయని 11కు ఫిక్సయ్యారు. ఐతే ‘వివేగం’ 10న వస్తే తమిళంలో తమ సినిమాకు ఇబ్బందవుతుందని ఆగస్టు 25పై దృష్టిపెట్టగా.. అజిత్ సినిమా వాయిదా పడటంతో 11కే ఫిక్సవ్వక తప్పలేదు. మొత్తానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ టీం రిలీజ్ డేట్ విషయంలో తర్జనభర్జనలు పడటం వల్ల మిగతా రెండు సినిమాలు 11కు ఫిక్సయ్యాయి. ఆ రోజుకు అది రాదనుకున్నారు. కానీ లేటుగా రేసులోకి వచ్చి 11కు ఫిక్సవడంతో మిగతా రెంటికీ ఇప్పుడు ఇబ్బందులు తప్పట్లేదు.