Begin typing your search above and press return to search.
దగ్గుబాటి సురేష్.. స్ట్రాటజిక్ రిలీజ్
By: Tupaki Desk | 27 July 2016 7:30 PM GMTతెలుగు పరిశ్రమలో పెద్ద సంఖ్యలో థియేటర్లు చేతిలో ఉన్న నిర్మాతల్లో దగ్గుబాటి సురేష్ ఒకరు. అందుకే ఆయన నిర్మాణంలో వచ్చే సినిమాలైనా.. ఆయన బ్యాకప్ ఉన్న సినిమాలైనా భారీగా రిలీజ్ చేసుకునే అవకాశం ఆయనకుంది. ఐతే సురేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘పెళ్లి చూపులు’ సినిమాను తక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. పైగా ఈ సినిమాకు విడుదలకు ముందు ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది. సినిమా చాలా బాగుందని సెలబ్రెటీలు.. మీడియా వాళ్లు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమాను తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు సురేష్ బాబు స్వయంగా చెప్పారు. ఇందుకు కారణం లేకపోలేదు.
‘పెళ్లి చూపులు’ మల్టీప్లెక్స్ ప్రేక్షకులు నచ్చే సినిమా. అర్బన్ ఆడియన్స్ సినిమాకు బాగా కనెక్టవుతారు. మాస్ ఆడియన్స్ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అలాగే కొత్త నటీనటులు.. దర్శకుడు కావడం వల్ల దీనికి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ లేదు. అందుకే ఊరికే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. లిమిటెడ్ థియేటర్లు.. అవి కూడా మంచి థియేటర్లు ఎంచుకుని రిలీజ్ చేస్తున్నారు సురేష్ బాబు. థియేటర్లు ఎక్కువ తీసుకోవడం వల్ల మెయింటైనెన్స్ బర్డెన్ పడుతుంది. అదే సెలెక్టివ్ గా మంచి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తే వాటికే మంచి కలెక్షన్లు వస్తాయి. మల్టీప్లెక్సులన్నీ కూడా ఈ సినిమా మీద బాగానే ఆసక్తి చూపిస్తున్నాయి కాబట్టి సమస్య లేదు. అందుకే సినిమాను తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తూ స్ట్రాటజిగ్గా వ్యవహరిస్తున్నారు సురేష్.